చిరంజీవి స్పెషల్ సాంగ్‌లో కన్నడ బ్యూటీ స్టెప్పులు.. మాస్ మ్యూజిక్‌తో భీమ్స్

వశిష్ట డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’(Vishwambara) చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇందులో చిరుకు జోడీగా త్రిష మరియు ఆషిక రంగనాథ్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గ్రాండ్ విజువల్స్, డివోషనల్ టచ్ కలిగిన కథాంశంతో ఈ సినిమా 2025లో విడుదల కానుందని టాక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు మేకర్స్ కొన్ని సరికొత్త హైలైట్‌లను జోడిస్తున్నారు. అందులో భాగంగా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి(MM Keeravaani) సంగీతం అందించగా.. ప్రత్యేక ఐటెం సాంగ్ కోసం మేకర్స్‌ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ (Beems) సిసిరోలియోను రంగంలోకి దింపారు. కధానుగుణంగానే ఈ సినిమాలో ఐటెం సాంగ్ ను ప్లాన్ చేశారట మేకర్స్. ప్రస్తుతం ఈ పాటకు సంగీతం అందించేందుకు భీమ్స్ పని ప్రారంభించినట్టు సమాచారం.

ఈ ఐటెం సాంగ్‌లో చిరంజీవికి జతగా డాన్స్ చేసే అవకాశం కన్నడ నటి నిశ్వికా నాయుడు(Nishvika Naidu)కి దక్కిందని తెలుస్తోంది. ఆమె నటించిన ‘కరటక దమనక’ సినిమాలో ప్రభుదేవాతో కలిసి చేసిన ‘హితలకా కరిబయడా మావ..’ పాటకు తెలుగులోనూ మంచి క్రేజ్ వచ్చింది. ఆ పాటలో ఆమె ఎనర్జిటిక్ డాన్స్ మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు మెగాస్టార్‌తో స్క్రీన్ షేర్ చేయనుందన్న విషయం ఆమె అభిమానులకే కాదు, టాలీవుడ్ వర్గాలకు కూడా ప్రత్యేక ఉత్సాహం కలిగిస్తోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *