
భారీ అంచనాలతో రిలీజ్ అయిన ‘రాబిన్‌హుడ్(Rabinhood)’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో నితిన్(Nitin) ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. అయితే దీనిని కవర్ చేసుకునేందుకు పవన్ కళ్యాన్ సూపర్ హిట్ మూవీ నేమ్ ‘తమ్ముడు(Thammudu)’తోని లేటెస్ట్ వర్షెన్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. దిల్ రాజు(Dil Raju) బ్యానర్‌లో డైరెక్టర్ వేణు శ్రీరామ్(Venu Sriram) తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో కాంతారా ఫేమ్ సప్తమి గౌడ(Saptami Gouda) హీరోయిన్‌గా, లయ(Laya) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్‌కు లయ రీఎంట్రీ
ఈ సినిమా నితిన్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్(Budget)తో రూపొందుతోంది, సుమారు 70 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్‌లో ఢిల్లీ, మారేడుమిల్లి, RFC వంటి వివిధ లొకేషన్లలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, క్లైమాక్స్(Climax) సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక నితిన్‌కు అక్కగా సీనియర్ హీరోయిన్ లయ(Laya) టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తోంది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్(trailer)లో నితిన్ కొత్త ప్రయత్నం, విజువల్స్, అక్కా-తమ్ముడు ఎమోషన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
సింపుల్ ఆర్కెస్ట్రైజేషన్‌తో..
తాజాగా ఈ చిత్రం నుంచి ‘భూ అంటూ భూతం’ అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. అజనీష్(Ajaneesh) సంగీతంలో సింహాచలం మన్నెం(Simhachalam Mannem) రాసిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి(Anurag Kulkarni), అక్షిత పోల(Akshit Pola) ఆలపించారు. సింపుల్ ఆర్కెస్ట్రైజేషన్‌తో వినగానే ఆకట్టుకునేలా ఉందీ గీతం. సందర్భానికి ఎలివేట్ చేస్తూ మంచి సాహిత్యం కనిపిస్తోంది. మరి ఈ సాంగ్‌నూ మీరూ వినేయండి..