మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మరోసారి ప్రేక్షకులను తన పెర్ఫార్మెన్స్‌తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకేసారి మూడు, నాలుగు ప్రాజెక్ట్ లను ముందుకు తీసుకెళ్తూ.. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్‌ను పూర్తిచేశారు. భారీ విజువల్స్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ ను అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో కలిసి ‘మెగా 157’ అనే వర్కింగ్ టైటిల్ తో మరో మాస్ ఎంటర్టైనర్‌ను చేస్తున్నారు చిరు. వచ్చే సంక్రాంతి 2026 టార్గెట్‌గా పెట్టుకొని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
కాగా, ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు( Chiranjeevi Birthday) సందర్భంగా భారీ అప్‌డేట్స్ రాబోతుందని తెలుస్తోంది. ‘మెగా 157’(Mega 157) టైటిల్, రిలీజ్ డేట్‌ను చిరంజీవి పుట్టినరోజున అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటూ సినీవర్గాల టాక్.
అంతేకాదు, ఇప్పటి వరకూ రిలీజ్ డేట్ బయటపెట్టని విశ్వంభర సినిమాకూ బర్త్‌డే సందర్భంగా ఒక భారీ గ్లింప్స్‌తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించే చాన్స్ ఉందంటున్నారు. దీంతో ఫ్యాన్స్‌కి ఒకేసారి రెండు డబుల్ ధమాకా.. చిరంజీవి బర్త్ డే గిఫ్ట్‌గా మెగా సర్‌ప్రైజ్ ఉండబోతోందన్నమాట.






