Bigg Boss 7 Telugu: ప్రశాంత్ అంటే అంత భయమా ?.. నన్ను అలాగే పంపించారు.. సందీప్ ఇన్ స్టా పోస్ట్..

ముందుగా వీరసింహాలు టీమ్ గెలిచింది. దీంతో వారికి స్పెషల్ పవర్ ఇచ్చి గేమ్ నుంచి ఒకిరిని తొలగించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‏బాస్. దీంతో అందరూ మాట్లాడుకుని గేమ్ నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన పల్లవి ప్రశాంత్ ను తప్పించారు. అయితే ఉన్నట్లుండి అలా గేమ్ నుంచి తప్పించడంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతతో శివాజీ, శోభా, అర్జున్, భోలే అంతా కలిసి ఓదార్చి ధైర్యం చెప్పారు. తన మెడలో వేసిన డెడ్ బోర్డ్ చూసి వచ్చే మరింత కసి పెంచుకోవాలని మోటివేట్ చేశాడు శివాజీ.

వీరసింహాలు, గర్జించే పులులు అంటూ రెండు టీములుగా విడదీసి కెప్టెన్సీ కంటెండర్ కోసం బిగ్‏బాస్ టాస్కులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు కూడా బాల్స్ కలెక్టింగ్ టాస్కు కంటిన్యూ అవుతుంది. అయితే ముందు నుంచి చెప్పినట్లుగానే టాస్కులలో బిగ్ ట్విస్ట్ ఇస్తున్నాడు బిగ్‏బాస్. ఇక నిన్నటి ఎపిసోడ్ లో టాస్కు స్టార్ట్ కావడంతోనే జంపింగ్ జపాంగ్ ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో ముందుగా వీరసింహాలు టీమ్ గెలిచింది. దీంతో వారికి స్పెషల్ పవర్ ఇచ్చి గేమ్ నుంచి ఒకిరిని తొలగించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‏బాస్. దీంతో అందరూ మాట్లాడుకుని గేమ్ నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన పల్లవి ప్రశాంత్ ను తప్పించారు. అయితే ఉన్నట్లుండి అలా గేమ్ నుంచి తప్పించడంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతతో శివాజీ, శోభా, అర్జున్, భోలే అంతా కలిసి ఓదార్చి ధైర్యం చెప్పారు. తన మెడలో వేసిన డెడ్ బోర్డ్ చూసి వచ్చే మరింత కసి పెంచుకోవాలని మోటివేట్ చేశాడు శివాజీ. అయితే పల్లవి ప్రశాంత్ ను గేమ్ నుంచి తప్పించడంతో గౌతమ్ అండ్ టీమ్ పై సోషల్ మీడియాలో నెగిటివిటీ వచ్చేసింది. తాజాగా ఈ విషయంపై బిగ్‏బాస్ నుంచి గతవారం ఎలిమినేట్ అయిన సందీప్ స్పందించాడు. అతడు తన ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

“పాపం రా.. ప్రశాంత్ మంచి ప్రేయర్. వాడిని ఎందుకు ‘డెడ్’ చేశారు ?. ప్రశాంత్ ఉంటే గేమ్ ఆడలేరా .. భయమా ?.. స్ట్రాంగ్ కంటెస్టెంట్లతో గేమ్ ఆడండి. స్ట్రాంగ్ ప్లేయర్లను బయటకు పంపి ఆడితే గేమ్ లో కిక్ ఉండదు. అవును.. నన్ను అలాగే బయటకు పంపారు. నేను స్ట్రాంగ్ ప్లేయర్ అని” అంటూ రెండు చేతులు జోడించిన ఎమోజీ షేర్ చేశాడు సందీప్. ప్రస్తుతం అతడు చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

Related Posts

పెళ్లి పీటలెక్కబోతున్న రామ్ చరణ్ హీరోయిన్

‘రూబా రూబా.. హే రూబా రూబా.. రూపం చూస్తే హాయ్ రబ్బా’.. అంటూ రామ్ చరణ్ తన గుండెల్లో వీణమీటిన హీరోయిన్ గురించి ఆరెంజ్ (Orange) సినిమాలో పాట పాడుతుంటాడు. అలా కేవలం చెర్రీ గుండెలోనే కాదు కుర్రకారు గుండెల్లో తిష్ట…

పద్మభూషణ్ బాలయ్యకు . సెలబ్రిటీల శుభాకాంక్షలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma Awards) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఈ జాబితాలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి నందమూరి బాలకృష్ణ, తమిళ ఇండస్ట్రీ నుంచి అజిత్ కుమార్, నటి శోభనలు పద్మభూషణ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *