మన ఈనాడు:
Minister KTR | కామారెడ్డిలో ఒక్కాయనను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, మోదీ, అమిత్ షా సహా 16 మందిని బీజేపీ తెచ్చుకుంటున్నదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు మోదీ చేసినది ఏంటో చెప్పాలని, ఆయన వల్ల రాష్ర్టానికి జరిగిన మేలేంటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో కేటీఆర్ వరుసగా రెండోరోజూ పర్యటించారు.
కామారెడ్డిలో ఒక్కాయనను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, మోదీ, అమిత్ షా సహా 16 మందిని బీజేపీ తెచ్చుకుంటున్నదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు మోదీ చేసినది ఏంటో చెప్పాలని, ఆయన వల్ల రాష్ర్టానికి జరిగిన మేలేంటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో కేటీఆర్ వరుసగా రెండోరోజూ పర్యటించారు. బుధవారం ఉమ్మడి భిక్కనూర్, దోమకొండ మండలాల్లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశమైన ఆయన తన ప్రసంగంతో శ్రేణుల్లో ఉత్తేజం నింపారు.
కామారెడ్డికి వచ్చి కేసీఆర్ ముందు తొడకొట్టుడు అంటే పోచమ్మ ముందు పొట్టేలును కట్టేసినట్టేనని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి హెచ్చరించారు. ఉద్యమంలో ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్‌రెడ్డి ఇక్కడికొచ్చి పోటీ చేస్తాడట అని ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ దొరలకు.. తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరు అని అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియాను బలిదేవతగా అభివర్ణించిన రేవంత్‌రెడ్డికి ఇప్పుడు ఆమె కాళికామాతలా కనిపిస్తున్నదా? అని ప్రశ్నించారు. సుద్దపప్పు అంటూ సంబోధించిన రాహుల్‌గాంధీ ఇప్పుడు తెలివిమంతుడిలా కనిపిస్తున్నాడా? అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్ రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ప్రభుత్వంలో దోమకొండను మున్సిపాలిటీ చేస్తామని హామీ ఇవ్వగా అదే వేదికపై కేసీఆర్‌కు ఎన్నికల ఖర్చు నిమిత్తం కోనాపూర్ గ్రామస్థులు రూ.50వేల నగదును అందించారు.
ఒక వ్యక్తి వల్లే కామారెడ్డికి కేసీఆర్
కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచీ రాష్ట్రమంతా ఒకటే చర్చ జరుగుతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. “కామారెడ్డికి కేసీఆర్ రావడానికి గంప గోవర్ధనే కారణం. ‘అన్నా..కామారెడ్డి రైతుల చిరకాల కోరిక ఒక్కటే. మా పొలాలకు గోదావరి నీళ్లు రావాలె. జల్దీగా నీళ్లు రావాలంటే మీరు రావాలి’ అని గోవర్ధన్ చెప్పడంతో రెండో ఆలోచన లేకుండా కేసీఆర్ ఒప్పుకున్నారు. కామారెడ్డి లో 9న నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఆ రోజు భిక్కనూర్, రాజంపేట మండ లాల నుంచి ఇంటికొకరు చొప్పున సభకు తరలి రావాలి.. అదిచూసి అవతలి పార్టీలో నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా మీరంతా రావాలి” అని మంత్రి కేటీఆర్ కోరారు.