Telangana Elections: బీజేపీ-పవన్‌ల పొత్తు ఫిక్స్..సీట్లు ఇవే

తెలంగాణ ఎన్నికల బరిలో చాలా పార్టీలు బరిలో దిగనున్నాయి. ఒకవైపు అధికార బీఆర్ఎస్ నెల రోజు క్రితమే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందు వరుసలో నిలిచింది. అయితే కాంగ్రెస్ ఒకవైపు అభ్యర్థుల ప్రకటన, మరోవైపు బస్సుయాత్రలు, బహిరంగసభల పేరుతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ ఇప్పటికే రెండు జాబితాలను ప్రకటించింది. మన్నటి వరకూ సీట్ల సర్థుబాటు విషయంలో మీన మేషాలు లెక్కించాయి రెండు పార్టీలు.

తెలంగాణ ఎన్నికల బరిలో చాలా పార్టీలు బరిలో దిగనున్నాయి. ఒకవైపు అధికార బీఆర్ఎస్ నెల రోజు క్రితమే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందు వరుసలో నిలిచింది. అయితే కాంగ్రెస్ ఒకవైపు అభ్యర్థుల ప్రకటన, మరోవైపు బస్సుయాత్రలు, బహిరంగసభల పేరుతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ ఇప్పటికే రెండు జాబితాలను ప్రకటించింది. మన్నటి వరకూ సీట్ల సర్థుబాటు విషయంలో మీన మేషాలు లెక్కించాయి రెండు పార్టీలు. అయితే తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఎట్టకేలకు ఖరారైంది.

వీరిద్దరి పొత్తులో భాగంగా జనసేనకు 8 లేదా 9 సీట్లు కేటాయించేందుకు సిద్దమైంది కమలం పార్టీ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనసేనకు రెండు స్థానాలు కేటాయించేందుకు సిద్దమైంది. కూకట్‌పల్లితో పాటు గ్రేటర్‌లో మరో సీటు జనసేనకు కేటాయించింది. ఇక మిగిలిన అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో జనసేన నుంచి 30కి పైగా అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించిన స్థానాలకే పరిమితమైంది. ఈ ఇరుపార్టీల కెమిస్ట్రీ ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయో తెలియాలంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడక తప్పదు. ఈ ప్రభావం ఏపీ రాజకీయాలపై కూడా చూపుతుందని చెబుతున్నరు రాజకీయ విశ్లేషకులు.

 

Related Posts

కటింగ్‌లు, కటాఫ్‌లు తప్ప.. రేవంత్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేంటి? 

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ఏడాది పాల‌న‌పై ఎక్స్ వేదికగా మరోసారి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను రేవంత్ సర్కార్ న‌ట్టేట ముంచిందని మండిపడ్డారు.  సంక్షేమ ప‌థ‌కాల‌కు కోత‌లు, క‌టాఫ్‌లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వ‌దిలేశార‌ని…

డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్.. చంద్రబాబుకు విజ్ఞప్తి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప ఎయిర్ పోర్టులో జిల్లా నేతలు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కడప నుంచి హెలికాప్టర్ లో చంద్రబాబు మైదుకూరు చేరుకున్నారు. మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి (NTR…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *