ఉప్పల్​ BRS గెలుపుకు ‘బేతి’ బలం!

మన ఈనాడు:గ్రేటర్​లో ఉప్పల్​ రాజ‘కీ’యం గడియారంలో ‘ముళ్లు’లా మారుతోంది. సిట్టింగ్​ ఎమ్మెల్యేను కాదని ఓ మంత్రి తన ప్రధాన అనుచరుడి కోసం టిక్కెట్​ ఇప్పించుకున్నారు. దీనికోసం సిట్టింగ్​ ఎమ్మెల్యే పనితీరు బాగలేకపోవడంతోనే ఉప్పల్​ టిక్కెట్​ మార్చాల్సి వచ్చిందని గులాబీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రచారంలోకి తీసుకెళ్లారు.

సంక్షేమ పథకాలు సిట్టింగ్​ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి ప్రజలతో ఉన్న సంబంధాలతో గులాబీ మరోసారి జెండాల ఎగరాల్సిన అవసరం ఉందని సీఎం గుర్తించారని సమాచారం. పార్టీలో ఉన్నత స్థానాలు కల్పిస్తామని సముచిత ఇవ్వడంతోపాటు ఉప్పల్​ గెలుపులో బేతి పాత్ర చాలా అవసరం ఉందని పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు.

కానీ గులాబీ పార్టీ పెద్దల నిర్ణయం పట్ల బీఆర్​ఎస్​ కార్యకర్తలు గందరగోళానికి గురైయ్యారు. పార్టీ మారుతున్నారంటూ ఉప్పల్ నియోజకవర్గంలో అధికారపార్టీ ఎమ్మెల్యేపై ప్రచారం జరిగింది.వీటితో మంత్రి కేటీఆర్​ పార్టీ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేను కనీసం ఆహ్వనం కూడా పలకలేదు.

ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి ప్రభావం గులాబీ బాస్​ గ్రహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పల్​ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి బీఆర్​ఎస్​ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి సహకరించాలని పట్టుబట్టారు. పదవులు కాదు..గులాబీ జెండా కోసం పనిచేసిన కార్యకర్తగా తాను బీఆర్​ఎస్​ కోసం పనిచేస్తానని ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి బాస్​కు హామీనిచ్చారు.

హస్తం జోరు తగ్గాలే…కారు స్పీడ్​ పెరగాలే
ఉప్పల్​ కాంగ్రెస్​ అభ్యర్థి పరమేశ్వరరెడ్డి ప్రచారం ముందున్నారనే విషయాన్ని ఇంటిలిజెన్స్​ వర్గాలు గులాబీ బాస్​ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఉప్పల్​ పగ్గాలు బీఆర్​ఎస్​ చేతిలోనే ఉండాలని ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. సీరియస్​గా తీసుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

Share post:

లేటెస్ట్