Mana Enadu : బిగ్‌బాస్ సీజన్ 8 తెలుగు (Bigg Boss 8 Telugu) ఊహించని ట్విస్ట్‌లు, టర్న్‌లతో క్లైమాక్స్‌కు చేరుకుంది. 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్టగా .. ఆ తర్వాత 8 మంది వైల్డ్‌కార్డు ఎంట్రీలను హౌస్‌లోకి పంపారు. ప్రతివారం ఎలిమినేషన్స్ జరుగుతండగా.. ఇప్పటి వరకు 15 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌజ్‌లో ఏడుగురు మాత్రమే మిగిలారు.
టాప్-5 కంటెస్టెంట్స్ ఎవరు?
“మీలో ఎవరు టాప్-5కి రావాలో ఆడియన్స్‌యే నిర్ణయిస్తారు” అంటూ అనౌన్స్ చేసిన బిగ్‌బాస్.. నామినేషన్స్ ప్రక్రియ లేకుండా గతవారం టికెట్ టూ ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన అవినాష్ (Bigg Boss Avinash) మినహా అందరినీ నేరుగా నామినేట్ చేశాడు. దీంతో ఈ వారం నామినేషన్స్‌లో విష్ణుప్రియ, గౌతమ్, నిఖిల్, ప్రేరణ, రోహిణి, నబీల్ నిలిచారు. సీజన్ 8 ఎండింగ్‌కు వచ్చిన నేపథ్యంలో టాప్ – 5 ఎవరా అనే ఉత్కంఠ ఆడియన్స్‌లో నెలకొంది.
ఫైనల్ కు ఆ ఐదుగురు
ఇక అవినాష్ నేరుగా ఫినాలేకి చేరుకున్న విషయం తెలిసిందే. టాప్-5 ఫైనలిస్టు(Bigg Boss Finalists)లో ఇక మిగిలిన నలుగురు ఎవరో ఈ వారం తేలనుంది. గతవారం లాగే ఈ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. అయితే ఒకరు మిడ్ వీక్‌లో, మరొకరు వీకెండ్లో ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం. మరోవైపు టాప్ 5 లో నిఖిల్, గౌతమ్, నబీల్, విష్ణుప్రియ, అవినాష్ ఉండనున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.
ఆరోజే గ్రాండ్ ఫినాలే
ఈ సీజన్లో ప్రైజ్ మనీ 54 లక్షల 30 వేల రూపాయలకు చేరింది. ఇది ఇంకా పెరిగే లేదా తగ్గే అవకాశం ఉందంటూ హోస్ట్ నాగ్ చెప్పారు. తాజా సమాచారం ప్రకారం బిగ్‌బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే (Bigg Boss 8 Grand Finale Telugu) ఎపిసోడ్ డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు టెలికాస్ట్ కానున్నట్లు తెలిసింది. మరో 13 రోజుల్లో సీజన్-8 ఎండ్ కాబోతోంది. ఇక ఈ సీజన్ లో ఫినాలే రోజున ట్రోఫీ అందజేయడానికి చీఫ్ గెస్టును కూడా పిలిచే ఆలోచనలో ఉన్నారట.






