Mana Enadu : బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 (Bigg Boss 8 Telugu) సీజన్ ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. 105 రోజుల పాటు సాగిన ఈ సీజన్ లో కన్నడ వాసి, సీరియల్ నటుడు నిఖిల్ విన్నర్ గా గెలిచిన విషయం తెలిసిందే. ఇక గౌతమ్ రన్నర్ గా నిలిచాడు. 22 కంటెస్టెంట్లు ఈ సీజన్ లో షోలో పాల్గొనగా గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్ (Avinash) ఫైనలిస్టులుగా నిలిచారు. వీరిలో నిఖిల్, గౌతమ్ ల మధ్య టఫ్ ఫైట్ నడవగా చివరగా జనం నిఖిల్ కు జై కొట్టారు. అలా నిఖిల్ రూ.55 లక్షల ప్రైజ్‌మనీ (Bigg Boss 8 Prize Money), మారుతీ సుజూకీ కారును సొంతం చేసుకున్నాడు.
23 మిలియన్ వ్యూస్
అయితే ఇప్పుడు ఈ షో గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అనుకుంటున్నారా..? ఎందుకంటే ఈ సీజన్ ఫినాలే ఎపిసోడ్ కు ఓటీటీలో భారీగా వ్యూస్ వచ్చాయట. బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఎపిసొడ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో ఏకంగా 23 మిలియన్ మంది (Bigg Boss 8 Views) చూశారని తెలుస్తుంది. అంటే 2 బిలియన్ వ్యూ మినిట్స్ దాకా నమోదయ్యాయన్నమాట. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఇది సూపర్ రికార్డ్ అని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ క్రేజీ ఎపిసోడ్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే.
కన్నడ వర్సెస్ తెలుగు
అయితే ఈ సీజన్ లో ఎప్పుడూ లేనట్టుగా తెలుగు వర్సెస్ కన్నడ కంటెస్టెంట్స్ అన్నట్లుగా బయట వ్యూయర్స్ మధ్య చర్చ జరిగింది. ఫినాలే తర్వాత కూడా.. కన్నడ నటుడు తెలుగు బిగ్ బాస్ గెలవడం ఏంటని కొందరు కామెంట్స్ చేశారు. అయితే నటుడిగా కన్నడ పరిశ్రమని వదిలి తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరుకి ఇక్కడే స్థిరపడాలని అనుకుంటున్న వారిని ప్రాంతాలతో వేరు చేయడం కరెక్ట్ కాదని మరికొందరు నెటిజన్లు నిఖిల్ (Bigg Boss Winner Nikhil) కు మద్దతుగా నిలిచారు.







