బిగ్‌బాస్ తెలుగు (Bigg Boss Show) రియాలిటీ షోకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రేక్షకులను మూడు నెలల పాటు టీవీలకు అతుక్కుపోయేలా చేసే ఈ షో.. ప్రతి సీజన్‌తోనూ సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కింగ్ అక్కినేని నాగార్జున(Nagarjuna)కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. సీజన్ -3 నుండి నాగార్జున హోస్టింగ్‌తో బిగ్ బాస్ తెలుగు మరింత మంది ప్రేక్షకులకు చేరువైంది. తనదైన స్టైల్, చమత్కారంతో పాటు సరైన సమయంలో కంటెస్టెంట్లను అభినందిస్తూనే తప్పు చేసినప్పుడు సున్నితంగా మందలిస్తూ నాగార్జున మెప్పిస్తారని ఆయనకు పేరుంది.
నాగార్జున, బాలకృష్ణలో ఎవరు?
నాగార్జున గతంలో మీలో ఎవరు కోటిశ్వరుడు షో చేశారు. నందమూరి బాలకృష్ణ(Nandamuri baalakrishna) తాజాగా ఆహా షో చేస్తూ అదరగొడుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ(compitation) నెలకొంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్-9కు వీరద్దరిలో ఎవరు ఫిక్స్ అవుతారో అని అటు ప్రేక్షకులకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, బిగ్ బాస్ షోకు అంత క్రేజ్ రావడానికి నాగార్జున హోస్టింగ్, క్రేజ్ కారణమని అంతా భావిస్తున్న తరుణంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
దాదాపు నాగార్జునే ఫిక్స్..
ఇప్పటికే గత 8 సీజన్లను బిగ్ బాస్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ సీజన్ -9 హోస్ట్‌గా కింగ్ అక్కినేని నాగార్జున పేరు దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. తొలుత బాలకృష్ణ హోస్ట్ చేస్తారని ఊహాగానాలు వినిపించినప్పటికీ తాజా సమాచారం ప్రకారం నాగార్జుననే మరోసారి బిగ్ బాస్ వేదికపై సందడి చేయనున్నట్లు సమాచారం. నాగార్జున బిగ్ బాస్‌కు కొత్త కాదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుండి సీజన్ 8 వరకు వరుసగా ఆరు సీజన్లకు ఆయన విజయవంతంగా హోస్టింగ్ చేశారు.
మళ్లీ ఆయనకే జై కొట్టారా?
ఇప్పుడు కొత్తగా బాలకృష్ణను తీసుకొస్తే మళ్లీ రేటింగ్ మీద ఎదైనా ఎఫెక్ట్ పడుతుందని భావించిన బిగ్ బాస్ యాజమాన్యం.. మళ్లీ నాగ్ నే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.అందుకోసం నాగార్జున రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటున్నట్లు సమాచారం. గత సీజన్లకు గాను ఆయన రూ.20 కోట్ల నుండి రూ. 30 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారని వార్తలొచ్చాయి. కాగా, సీజన్-9 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






