నాకు ‘మా’ మెంబర్ షిప్ ఇవ్వలేదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్

మంచు ఫ్యామిలీ వివాదం కొన్ని రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. బహిరంగంగానే మంచు మోహన్ బాబు (Mohan Babu) చిన్న తనయుడు మంచు మనోజ్ (Manchu Manoj) తన కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా తన సోదరుడు మంచు విష్ణుపై తీవ్రంగా ఆరోపణలు చేయడం గమనార్హం. అయితే తాజాగా మనోజ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మెంబర్‌షిప్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మే 20వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా మనోజ్ మీడియాతో మాట్లాడాడు.

MAAలో మెంబర్‌షిప్ ఇవ్వలేదు

ఈ సందర్భంగా ఆయన ‘మా (Movie Artists Association) మెంబర్షిప్’ గురించి సంచలన కామెంట్స్ చేశాడు. తనకు MAAలో మెంబర్‌షిప్ ఇవ్వలేదని అన్నాడు. మనోజ్ సోదరుడు మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. మరోవైపు సినిమాల నుంచి గ్యాప్ తీసుకోవాలని తాను ఎప్పుడో అనుకున్నానని మనోజ్ తెలిపాడు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఆయన ‘భైరవం (Bhairavam)’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మే 30న భైరవం రిలీజ్

బెల్లంకొండ సాయిశ్రీనివాస్,  నారా రోహిత్‌(Nara Rohit)లతో కలిసి మంచు మనోజ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. మే 30వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇక తొమ్మిదేళ్ల గ్యాప్ ఎందుకు వచ్చిందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘శివయ్యను శివయ్య అని పిలిస్తే రాడు, ఆయన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల రూపంలో వస్తాడు’ అంటూ ఆయన కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధి ప్రస్తావించగా మంచు మనోజ్ నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *