Vishal: తమిళ నటితో నటుడు విశాల్‌ వివాహం..?

తమిళ నటుడు విశాల్ (Actor Vishal) తెలుగువారికీ సుపరిచతమే. ఆయన సినిమాల విషయంలోనే కాకుండా పెళ్లి విషయంలో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే త్వరలో హీరో విశాల్ వివాహం అంటూ చాలా సార్లు వార్తలు వచ్చాయి. కానీ ఒక్కటి కూడా పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. ఇక గతంలో నటి అనీషాతో ఏకంగా నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఏవో కారణాల వల్ల ఆ పెళ్లి రద్దయింది. ఆ తర్వాత పలువురు నటీమణులతో ఆయన ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వచ్చినా ఒక్కటీ అధికారికంగా కన్ఫామ్ కాలేదు.

Image

మరోసారి తెరపైకి విశాల్ వివాహం

ఇక తాజాగా తాను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని నటుడు విశాల్‌ (Vishal) ఇటీవల ప్రకటించడంతో మరోసారి ఆయన వివాహం గురించి పలు వార్తలు తెరపైకి వచ్చాయి. తమిళ హీరోయిన్‌ సాయి ధన్సిక (Sai Dhanshika)తో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తమిళ మీడియా కోడై కూస్తోంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే ఏడడుగులు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే  ఈ వార్తలపై ఇటు విశాల్‌ కానీ అటు సాయి ధన్సిక మాత్రం స్పందించలేదు.

త్వరలోనే పెళ్లి చేసుకుంటా

ఇక గతంలోనూ విశాల్ వివాహంపై ఎన్నో వార్తలు వచ్చాయి.  నటి వరలక్ష్మి, మరో నటి అభినయ వంటి పలువురు హీరోయిన్స్‌ పేర్లు కూడా వార్తల్లో నిలిచాయి. కానీ వాళ్లిద్దరు వేరే వారితో వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో ఆ వార్తలన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇక తాజాగా ‘నడిగర్‌ సంఘం’ బిల్డింగ్‌ నిర్మాణం పూర్తైన వెంటనే తాను పెళ్లి చేసుకుంటానని గతంలో ప్రకటించిన విశాల్.. ఇటీవల ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తి కావడంతో తన పెళ్లి గురించి మాట్లాడుతూ త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *