Shilpa Shirodkar : మహేశ్ బాబు మరదలికి కరోనా పాజిటివ్

గత ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి (Corona Virus) మళ్లీ భారతదేశంలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. ఇప్పటికే సన్ రైజర్స్ ఆటగాడు ట్రావిస్ హెడ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా బాలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ, సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) మరదలు శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. తన​కు కరోనా పాజిటివ్​గా తేలిందని తెలియజేస్తూ ఆమె ఇన్​స్టా వేదికగా సోమవారం వెల్లడించారు. తన అభిమానులు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.

నాకు కరోనా పాజిటివ్ వచ్చింది

‘హాయ్ ఫ్రెండ్స్! నాకు కోవిడ్ పరీక్షలో పాజిటివ్ అని తేలింది. మీరు మాస్క్ ను ధరించండి’ అని శిల్ప (Shilpa Shirodkar) తన ఇన్​స్టాలో పోస్టు చేశారు. ఆమెకు కరోనా (Covid 19) రావడంపై అభిమానులతో పాటు బాలీవుడ్ సెలిబ్రిటీలు  స్పందించారు. శిల్ప త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా స్పందిస్తూ.. శిల్పా శిరోద్కర్ త్వరగా కోలుకోవాలని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా ఇంకా గాలిలోనే ఉందని, మాస్క్ ధరించాలని అన్నారు. మరోవైపు కొందరు మాత్రం ఇంకా కరోనా బారిన పడుతున్నారా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ కు రీ ఎంట్రీ

మహేశ్ బాబు సతీమణి నమ్రతా (Namratha Shirodkar) చెల్లెలే శిల్పా శిరోద్కర్. ఆమె కూడా అప్పట్లో మోడల్. 90స్​లో బాలీవుడ్ హీరోయిన్​గా మంచి గుర్తింపు పొందారు. ఇటీవల హిందీ బిగ్ బాస్ షోతో రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో శిల్పా శిరోద్కర్ మోహన్ బాబు సరసన ‘బ్రహ్మ’ అనే చిత్రంలో కనిపించారు. మహేశ్ బావ, యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న జటాధర (Jatadhara) సినిమాతో టాలీవుడ్ కు శిల్ప రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *