తెలుగు హీరోతో మణిరత్నం నెక్స్ట్ సినిమా!.. కాంబో మాత్రం క్రేజీ గురూ

ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) ప్రస్తుతం నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ‘థగ్ లైఫ్ (thug Life)’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ జూన్​ 5వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మణిరత్నం ప్రస్తుతంఈ సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన తెలుగు హీరోతో ఓ చిత్రం చేయనున్నట్లు వార్తలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ నటుడితో ఓ యూత్ ఫుల్ ఎంటర్​​టైనర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ సినిమాలో హీరో ఎవరంటే..?

Image

మణిరత్నంతో జాతిరత్నం

తన నటన, కామెడీ టైమింగుతో అందర్నీ ఆకట్టుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty)తో మణిరత్నం ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం ఇప్పటికే మణిరత్నం నవీన్​ను కలిసినట్లు తెలిసింది. ఈ కాంబోలో మూవీ ఉంటుందని గతంలోనే వార్తలొచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే మణిరత్నం- నవీన్ పొలిశెట్టి కాంబోలో సినిమా అంటే ఊహకే కాస్త వెరైటీగా అనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఏదైమైనా ఈ క్రేజీ కాంబోలో సినిమా పక్కా చూడాల్సిందే గురూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కోలీవుడ్ లోనూ మంచి డిమాండ్

ఇక సహజమైన నటన, ఎక్స్ ప్రెషన్స్ తో, తనదైన కామెడీ టైమింగుతో నవీన్ పొలిశెట్టి తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ప్రస్థానం మొదలుపెట్టిన నవీన్.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత ‘జాతిర‌త్నాలు (Jathiratnalu)’, ‘మిస్ శెట్టి.. మిస్ట‌ర్ పోలిశెట్టి’తో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం నవీన్.. ‘అన‌గ‌న‌గా ఒక రాజు (Anaganaga Oka Raju)’ అనే సినిమా చేస్తున్నాడు.  మణిరత్నంతో సినిమా ఓకే అయితే, అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్​లోనూ నవీన్ పొలిశెట్టికి మంచి డిమాండ్ ఉంటుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *