బిగ్‌బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి(Bigg Boss fame Amardeep Chowdhury) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుమతీ శతకం(Sumathi Satakam)’ నుంచి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్(First look poster) విడుదలైంది. ఈ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజన్ మూవీ మేకర్స్(Vision Movie Makers) బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. నాయుడు(MM Naidu) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అమర్ దీప్ మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలో కనిపించనున్నారు. పోస్టర్‌లో అమర్ దీప్ కూరగాయల దండలతో, గ్రామీణ నేపథ్యంలో సరళమైన లుక్‌లో ఆకట్టుకుంటున్నారు.
గ్రామీణ ప్రేమకథగా, వింటేజ్ విలేజ్ డ్రామా
ఈ మూవీ గ్రామీణ ప్రేమకథగా, వింటేజ్ విలేజ్ డ్రామా(Vintage Village Drama)గా రూపొందుతోంది. సైలీ చౌదరి(Saily Chowdhury) హీరోయిన్‌గా నటిస్తుండగా, టేస్టీ తేజ(Testy Teja), మహేష్ విట్టా, జెడివి ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుభాష్ ఆనంద్ సంగీతం, బండారు నాయుడు సంభాషణలు, హాలేష్ సినిమాటోగ్రఫీ, నాహిద్ మొహమ్మద్ ఎడిటింగ్‌తో ఈ చిత్రం సాంకేతికంగా ఉన్నతంగా రూపొందుతోంది. షూటింగ్ పూర్తైన ఈ సినిమా దసరా సందర్భంగా విడుదల కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్
కాగా త్వరలోనే టీజర్, ట్రైలర్(Trailer)లను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ పోస్టర్ తెలుగు సాంప్రదాయ విలువలను, గ్రామీణ వాతావరణాన్ని ప్రతిఫలిస్తూ, ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా అందరినీ ఆకర్షిస్తోంది. అమర్ దీప్ అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.






