
బిగ్‌బాస్(Biggboss) షోతో పాపులర్ అయిన నటుడు గౌతమ్ కృష్ణ(Gautam Krishna) తాజా చిత్రం ‘సోలో బాయ్(Solo Boy)’తో హీరోగా రెండో మూవీలో ఎంట్రీ ఇస్తున్నాడు. డైరెక్టర్ నవీన్ కుమార్(Naveen Kumar) దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్(Satish Kumar) నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్వేతా అవస్తీ(Shweta Awasthi), రమ్య పసుపులేటి(Beautiful yellow) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali), అనిత చైదరి, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఇప్పటికే విడుదలైన ‘సోలో బాయ్’ ఫస్ట్ లుక్ పోస్టర్(first look poster), సాంగ్ సినీ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి.
జులై 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల
తాజాగా రిలీజైన పోస్టర్‌లో గౌతమ్.. రమ్య పసుపులేటితో కలిసి కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఈ పోస్టర్ యూత్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని జులై 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల(Release) చేయనున్నట్లు ప్రకటించారు. యూత్‌ఫుల్ కథతో, రొమాంటిక్ వైబ్‌తో, ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఫుల్ ఎంగేజ్ చేయనుంది. గతంలో ‘ఆకాశ వీధుల్లో’ చిత్రంతో ఆకట్టుకున్న గౌతమ్ మరోసారి హీరోగా ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి.