సినీ నటుడు మహేశ్ విట్టా(Mahesh Vitta) ఇప్పుడు తన జీవితంలో మరో మధురమైన ఘట్టంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయన త్వరలోనే తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా(Social Media) వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా తన అర్ధాంగి శ్రావణి రెడ్డి(Sravani Reddy) నిండు గర్భిణిగా ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో పంచుకున్నారు.ఈ పోస్ట్ చూసిన అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు మహేశ్ విట్టా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
View this post on Instagram
మహేశ్ విట్టా తన కెరీర్‌ను ‘Fun Bucket’ వీడియోలతో ప్రారంభించి, ఆ తర్వాత ‘BIGG BOSS’ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ షోలో రెండుసార్లు పాల్గొని, కొన్ని వారాల పాటు తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. ‘బిగ్‌బాస్’ షోతో వచ్చిన గుర్తింపుతో ‘కృష్ణార్జున యుద్ధం’, ‘కొండపొలం’ వంటి పలు చిత్రాలతోపాటు పలు షోస్‌లోనూ హాస్యం పండించారు. నటుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వ్యక్తిగత జీవితానికి వస్తే, మహేశ్ విట్టా, శ్రావణి రెడ్డి ఐదేళ్ల పాటు ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో 2023లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.






