Mahesh Vitta: తండ్రి కాబోతున్న బిగ్‌బాస్ ఫేమ్ నటుడు

సినీ నటుడు మహేశ్ విట్టా(Mahesh Vitta) ఇప్పుడు తన జీవితంలో మరో మధురమైన ఘట్టంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయన త్వరలోనే తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా(Social Media) వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా తన అర్ధాంగి శ్రావణి రెడ్డి(Sravani Reddy) నిండు గర్భిణిగా ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పంచుకున్నారు.ఈ పోస్ట్ చూసిన అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు మహేశ్ విట్టా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Vitta (@maheshvitta)

మహేశ్ విట్టా తన కెరీర్‌ను ‘Fun Bucket’ వీడియోలతో ప్రారంభించి, ఆ తర్వాత ‘BIGG BOSS’ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ షోలో రెండుసార్లు పాల్గొని, కొన్ని వారాల పాటు తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. ‘బిగ్‌బాస్’ షోతో వచ్చిన గుర్తింపుతో ‘కృష్ణార్జున యుద్ధం’, ‘కొండపొలం’ వంటి పలు చిత్రాలతోపాటు పలు షోస్‌లోనూ హాస్యం పండించారు. నటుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వ్యక్తిగత జీవితానికి వస్తే, మహేశ్ విట్టా, శ్రావణి రెడ్డి ఐదేళ్ల పాటు ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో 2023లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *