అక్కినేని నాగార్జున (Nagarjuna) హోస్ట్‌గా చేస్తున్న ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ (Bigg Boss Telugu). ఇప్పటికి 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు మరోసారి అలరించడానికి సిద్ధమైంది. ‘చదరంగం కాదు.. ఈసారి రణరంగం’ అంటూ ఇటీవల ‘బిగ్‌బాస్ సీజన్ 9’ (Bigg Boss Season 9) నాగార్జున ప్రకటించారు. తాజాగా మరో ఆసక్తికర అప్‌డేట్‌ను పంచుకున్నారు. షోలోకి సామాన్యుల(General People)ను సైతం ఆహ్వానిస్తున్నట్లు నాగ్ తెలిపారు.
అభిమానులకు రిటర్న్ గిఫ్ట్
‘‘ఇప్పటివరకూ మీరు బిగ్‌బాస్ షోను ఎంతో ప్రేమించారు. ఇంత ప్రేమను ఇచ్చిన మీకు.. రిటర్న్ గిఫ్ట్(Return Gift)గా ఏమివ్వాలి? మీరు ఎంతగానో ప్రేమించిన బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీయే రిటర్న్ గిఫ్ట్. ఈ సారి హౌస్‌లోకి సెలబ్రిటీలే కాదు. మీకూ అవకాశం ఉంది. వచ్చేయండి. బిగ్‌బాస్9 తలుపులు తెరిచి మీకోసం ఎదురు చూస్తున్నాయి’’ అని నాగార్జున(Nagarjuna) పేర్కొన్నారు.
కారణం చెబుతూ వీడియో అప్‌లోడ్ చేస్తే చాలు
ఇందుకు చేయాల్సిందల్లా bb9.jiostar.com వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయి, బిగ్‌బాస్9లో పాల్గొనడానికి కారణం చెబుతూ వీడియో(Video)ను అప్‌లోడ్ చేస్తే, షరతుల మేరకు హౌస్‌మేట్ అయ్యే ఛాన్స్ లభించవచ్చని జియో హాట్‌స్టార్(Jio Hotstar) పేర్కొంది. కాగా అంతకుముందు ‘ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే, యుద్ధం చేస్తే సరిపోదు. ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు. రణరంగమే’ అంటూ నాగార్జున సీజన్9ను ప్రోమో(Promo)తో ఎంటర్టైన్ చేసిన విషయం తెలిసిందే.






