హస్తినలో కమలం(BJP) పాగా వేయడం పక్కా అని ఎగ్జిట్ పోల్స్(Exit Polls) తేల్చేశాయి. హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) కమలం విజయం సాధించబోతోందని దాదాపు అన్ని సర్వే సంస్థలు(Survey Organizations) ప్రకటించాయి. ఇందులో ప్రధాన సర్వే సంస్థలన్నీ BJPకి జై కొట్టగా, KK, వీ ప్రిసైడ్(WeePreside) సర్వే సంస్థలు మాత్రం మరోసారి ఢిల్లీ పీఠం ఆప్(AAP)దేనని సంచలన రిజల్ట్స్ ఇచ్చాయి. ఇక ఈసారి ఎలాగైనా ఢిల్లీలో ఖాతా తెరవాలనుకున్న కాంగ్రెస్(Congress) ఖాతా తెరిచే అవకాశం దాదాపుగా కష్టమేనని తేల్చి చెప్పాయి. మరి ఈ ఎన్నికల్లో ఢిల్లీ ఓటరు ఎవరికి జై కొట్టారు.. ఎవరికి షాక్ ఇవ్వనున్నారో తెలియాలంటే ఈ నెల 8వ తేదీ వరకూ ఆగాల్సిందే.
కేకే సర్వే సంచలన తీర్పు
కాగా మరోవైపు గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సరిగ్గా అంచనా వేసి దేశవ్యాప్తంగా పేరును సంపాదించుకున్న KKసర్వే మాత్రం అందరికంటే భిన్నంగా ఫలితాలను ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) 44 స్థానాలతో మరోసారి అధికారంలోకి వస్తుందని, BJP కేవలం 26 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది. వీ ప్రిసైడ్ అనే సంస్థ కూడా 46 నుంచి 52 స్థానాలతో మరోసారి ఆప్ అధికారంలోకి వస్తుందని, BJP 18 నుంచి 23 స్థానాలతో సరిపెట్టుకుంటుందని తెలిపింది. అయితే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, CM అతిశీ, Dy.CM మనీష్ సిసోదియాల విజయం కష్టమేనని కేకే సహా మరికొన్ని సర్వేలు తెలిపాయి.
Delhi Exit Poll Results 2025: BJP could make a comeback in Delhi after 27 years#DelhiElection2025 #DelhiAssemblyElection2025 #DelhiExitPolls #DelhiExitPollResults pic.twitter.com/H5Cm23wyNE
— Update Now News (@updatenownews) February 5, 2025
70 స్థానాల్లో 60.10% పోలింగ్
కాగా ఢిల్లీ అసెంబ్లీ పరిధిలోని మొత్తం 70 నియోజకవర్గాల్లో బుధవారం ఓటింగ్(Voting) జరిగింది. 60.10% పోలింగ్(Polling) నమోదైంది. 699 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు EVMలలో నిక్షిప్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ సింగ్ పురి, ఢిల్లీ CM అతిశీ, AAP కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, CJI జస్టిస్ సంజీవ్ ఖన్నా, CEC రాజీవ్ కుమార్ సహా మరికొందరు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.








