భారత్లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన జాతీయ పార్టీగా BJP నిలిచింది. దేశంలోని జాతీయ పార్టీలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయాల వివరాలతో ‘అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ADR)’ ఒక రిపోర్టును విడుదల చేసింది. దీని ప్రకారం 2023-24లో BJPకి ఏకంగా రూ.4,340.47 కోట్ల ఆదాయం వచ్చింది. భారత్‌లోని 6 జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 74.57% సమానమైన ఆదాయాన్ని ఒక్క బీజేపీయే సంపాదించడం విశేషం.
ఎన్నికల వ్యయాలు, పాలనాపరమైన ఖర్చులే అధికం
కాగా 2023-24 ఆర్థిక సంవత్సరం(Financial Year)లో విరాళాలు, ఆర్థిక సాయాల ద్వారా దేశంలోని జాతీయ పార్టీలకు రూ.2,669.87 కోట్లు సమకూరాయి. ఇందులో కాంగ్రెస్(Congress)కు రూ.58.56 కోట్లు, CPMకు రూ.11.32 కోట్లు వచ్చాయి. CPM, కాంగ్రెస్, BJPల విరాళాలకు సంబంధించిన ఆడిట్ నివేదిక(Audit report)లు సగటున 12 నుంచి 66 రోజులు ఆలస్యంగా కేంద్ర ఎన్నికల సంఘానికి అందాయి. జాతీయ స్థాయి రాజకీయ పార్టీల ఖర్చుల్లో ఎక్కువ భాగం ఎన్నికల వ్యయాలు(Election expenses), పాలనాపరమైన ఖర్చులే ఉండటం గమనార్హం.
50శాతం నిధులనే ఖర్చు చేసిన బీజేపీ
ఇదిలా ఉండగా.. కమలదళం తమ ఇన్‌కంలో కేవలం 50.96 శాతం (రూ.2,211.69 కోట్లు) నిధులనే ఖర్చు చేసింది. ఇదే వ్యవధిలో కాంగ్రెస్ పార్టీకి రూ.1,225.12 కోట్ల ఆదాయం రాగా, 83.69 శాతం (రూ.1,025.25 కోట్లు) నిధులను ఖర్చు చేసింది. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా రూ.619.67 కోట్లను పాలనా వ్యవహారాలకు వెచ్చించింది. CPM తమ పార్టీపరమైన పాలనా వ్యవహారాలు, సాధారణ ఖర్చుల కోసం రూ.56.29 కోట్లను వెచ్చించింది. ఉద్యోగుల కోసం రూ.47.57 కోట్లను ఖర్చు చేసిందని తాజా నివేదిక పేర్కొంది.
Total Income and expenditure declared by political parties for FY 2023-24. Among 6 national parties BJP shown highest income with share of 74.56 %, Congress 2nd highest with 21.04%, CPIM 2.88%, BSP 1.11%, AAP 0.38% and NPEP 0.004 % https://t.co/I4xYvp6PMx pic.twitter.com/rhColyMWqW
— राजस्थानी ट्वीट (@8PMnoCM) February 17, 2025






