
ఒకే దేశం, ఒకే ఎన్నికలు(One Nation, One Election bill) జమిలి ఎన్నికలు అనే అంశంపై ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (Join Parlimentary Committee)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో గురువారం 31 మంది సభ్యులను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఎనిమిది మందిని ఈ కమిటీలో చేర్చింది. దీంతో ప్రస్తుతం JPC సభ్యుల సంఖ్య 39కి పెరిగింది. కాగా ఇవాళ సంబంధిత బిల్లులు కూడా జేపీసీకి పంపించారు. లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకారం, 27 మంది లోక్‌సభ, 12 మంది రాజ్యసభ ఎంపీలతో కూడిన జేపీసీ బిల్లును పరిశీలించనుంది. జమిలి ఎన్నికలపై ఏర్పాటైన ఈ కమిటీకి బీజేపీ ఎంపీ పీపీ చౌదరీ(MP PP Chaudhary) ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
లోక్‌సభ నుంచి JPCలో చోటు దక్కించుకుంది వీరే..
1. పీపీ చౌదరి
2. సీఎం రమేష్
3. బన్సూరి స్వరాజ్
4. పురుషోత్తం భాయ్ రూపాలా
5. అనురాగ్ సింగ్ ఠాకూర్
6. విష్ణు దయాల్ రామ్
7. భర్తృహరి మహతాబ్
8. ప్రియాంకా గాంధీ వాద్రా
9. మనీష్ తివారీ
10. సుఖ్ దేవ్ భగత్
11. ధర్మేంద్ర యాదవ్
12. సంబిత్ పాత్రా
13. అనిల్ బలూని
14. విష్ణు దత్ శర్మ
15. బైజయంత్ పాండా
16. సంజయ్ జైశ్వాల్
17. చోటేలాల్
18. కళ్యాణ్ బెనర్జీ
19. టీఎం సెల్వగణపతి
20. జీఎం హరీశ్ బాలయోగి
21. అనిల్ యశ్వంత్ దేశాయ్
22. సుప్రియా సూలే
23. శ్రీకాంత్ ఏక్ నాథ్ షిండే
24. శాంభవి
25. కే రాధాకృష్ణన్
26. చందన్ చౌహాన్
27. బాలశౌరి వల్లభనేని
రాజ్యసభ నుంచి JPCలో 12 ఎంపీలు వీరే..
1. ఘన్‌శ్యామ్ తివారీ
2. భుభనేశ్వర్ కలిత
3. సాకేత్ ఘోకలే
4. పి.విల్సన్
5. సంజయ్ సింగ్
6. మానస్ మంగరాజ్
7. వి.విజసాయిరెడ్డి
8. కే.లక్ష్మణ్
9. కవితా పాటిదార్
10. సంజయ్ కుమార్ ఝా
11. రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా
12. ముకుల్ వాన్‌సిక్