
శీతాకాలంలోనూ వరుణుడు ఏపీ(Andhra Pradesh)ని వదలడం లేదు. నైరుతి బంగాళాఖాతం(Southwest Bay of Bengal)లో తీవ్ర అల్పపీడనం మరింత బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) పేర్కొంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడిచింది. దీంతో రానున్న 12 గంటల్లో అది తీవ్ర వాయుగుండం(Extreme weather)గా మారి కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని హెచ్చరించింది. అలాగే మరో 24 గంటలపాటు వాయుగుండం కొనసాగుతూ ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు(Heavy Rains) కురుస్తాయని చెప్పింది. రైతులు(Formers) పంటల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే మత్స్యకారులు(Fishermen) వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.
వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష
అల్పపీడనం ప్రభావంతో శనివారం (DEC 21) పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురుస్తాయని వెల్లడించింది. అదే సమయంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, YSR కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తాజా బులెటిన్‌లో పేర్కొంది. అటు కళింగపట్నం-మచిలీపట్నం వరకూ అన్ని పోర్టుల్లోనూ 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర హోంమంత్రి అనిత(Home Minister Anitha) వర్షాలపై అధికారులతో సమీక్షించారు. ఎప్పటికప్పుడు హెచ్చరించే సందేశాల ద్వారా ప్రజలు, రైతులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
Overnight rains to continue in North Ap & #vizag belt due to depression in west central bay of bengal, from tomorrow onwards rain intensity may decrease gradually #Invest91B pic.twitter.com/tJHJPZhCjr
— Eastcoast Weatherman (@eastcoastrains) December 20, 2024