దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబోలో SSMB29 సినిమా వస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఇటు జక్కన్న ఫ్యాన్స్.. అటు మహేశ్ బాబు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది.
సస్పెన్స్ క్రియేట్ చేసిన జక్కన్న
కానీ ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా జక్కన్న(SS Rajamouli) జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక కొత్త ఏడాదిలో ఈ సినిమా ముచ్చట్లు తెలియజేస్తూ జక్కన్న ప్రెస్ మీట్ నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఇలా మహేశ్ బాబుతో సినిమా విషయంలో జక్కన్న చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. ఈ సస్పెన్స్ ను అభిమానులు మాత్రం తట్టుకోలేకపోతున్నారు.
మహేశ్ తో ప్రియాంకా
ఇక ఈ పాన్ వరల్డ్ మూవీలో గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) కూడా భాగమైనట్లు తెలిసిందే. ఈ బ్యూటీ ఇటీవల లాస్ ఏంజిల్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చింది. ఈ సమయంలో ఈ భామకు స్క్రీన్ టెస్ట్ నిర్వహించినట్లు సమాచారం. దీనిపైనా జక్కన్న టీమ్ అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఇక తాజాగా ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు భాగం కానున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
SSMB29లో బాలీవుడ్ స్టార్
బీ టౌన్ స్టార్ హీరో, కండల వీరుడు జాన్ అబ్రహం (John Abraham) SSMB29 సినిమాలో భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అతడి కాల్షీట్లు ఖాళీ లేకపోవడంతో ఆ స్థానంలో జాన్ అబ్రహంను సంప్రదించినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.






