ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. మార్చి 22న ప్రారంభం కానున్న ధనాధన్ క్రికెట్ ఈవెంట్ మే 25వ తేదీ వరకూ అభిమానులను అలరించనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో జరిగే ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ KKRతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనుంది. ఈ మ్యాచ్ శనివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
అదిరిపోయేలా ఏర్పాట్లు
ఈ నేపథ్యంలో తొలిరోజు మ్యాచ్‌కు ముందు అదిరిపోయేలా IPL 18వ సీజన్‌ను ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు(Bollywood Star Celebrities) అభిమానులను ఉర్రూతలూగించనున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), సల్మాన్ ఖాన్(Salman Khan), సంజయ్ దత్, విక్కీ కౌశల్ వంటి స్టార్ హీరోలు ఈ ఈవెంట్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు క్రిక్ బజ్(Cricbuzz) తెలిపింది.

వారితో స్పెషల్ డ్యాన్స్ షో
వీరితో పాటు సంగీత ప్రదర్శన కోసం అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్(Shreya Ghoshal) సందడి చేయనున్నారట. మరోవైపు బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ(Disha Patani), శ్రద్ధా కపూర్(Shraddha Kapoor)తో పాటు వరుణ్ ధవన్(Varun Dhawan)లతో స్పెషల్ డ్యాన్స్ షో నిర్వహించనున్నట్లు సమాచారం. మొత్తానికి తొలిరోజే అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు ఐపీఎల్ 2025 ముస్తాబవుతోంది.
🔥 Disha Patani Set to Light Up IPL 2025 Opening Ceremony! 🔥
– Bollywood star Disha Patani will set the stage on fire with her electrifying performance at the IPL 2025 opening ceremony! 🎤💃✨#IPL2025 #OpeningCeremony #DishaPatani #CricketFestival pic.twitter.com/xbki3bWv2p
— Akaran.A (@Akaran_1) March 19, 2025








