Bomb Threat: అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియానికి బాంబు బెదిరింపు

ప్రస్తుతం భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2025) సందడి చేస్తోంది. ఈ పొట్టి ఫార్మాట్ లీగ్‌‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్ ప్లేయర్లు(Star Cricketers) తమ అద్భుత ఆటతో అభిమానులను అలరిస్తున్నారు. గత నెలన్నర రోజులుగా IPL ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ అహ్మదాబాద్‌(Ahmadabad)లోని ప్రఖ్యాత నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియాని(Narendra Modi Cricket Stadium)కి ఈరోజు బాంబు బెదిరింపు(Bomb threat) రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో భద్రతా వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. రాబోయే రోజుల్లో ఇక్కడ కీలక ఐపీఎల్ మ్యాచ్‌లు(IPL mathes) జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది.

GCA అధికారిక మెయిల్‌కు సందేశం

గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(Gujarat Cricket Association) అధికారిక ఈమెయిల్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఓ బెదిరింపు సందేశం అందినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘మేము మీ స్టేడియంను పేల్చివేస్తాం(We will blow up your stadium)’ అనే హెచ్చరికతో కూడిన ఈ మెయిల్‌ను ‘పాకిస్థాన్(Pakistan)’ పేరుతో పంపినట్లు సమాచారం. ఈ బెదిరింపును అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

Narendra Modi Stadium | Populous

స్టేడియం పరిసరాల్లో భద్రత పెంపు

ముఖ్యంగా, ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ పరిణామాల తర్వాత ఈ తరహా హెచ్చరిక రావడంతో భద్రతా ఏజెన్సీలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. గుజరాత్ పోలీసులు, సైబర్ క్రైమ్ నిపుణుల బృందం ఈమెయిల్ మూలాలపై దర్యాప్తు ప్రారంభించాయి. అటు నరేంద్ర మోదీ స్టేడియం పరిసర ప్రాంతాలతో పాటు, స్టేడియం లోపల కూడా భద్రతను భారీగా పెంచారు.

Related Posts

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

మీ ఉద్యోగం కూడా ఈ లిస్టులో ఉందా? ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు మాయం!

కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *