
బాంబు బెదిరింపు(Bomb Threats) వార్త మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో కలకలం రేపింది. ఈ మేరకు గురువారం (ఏప్రిల్ 3) మధ్యాహ్నం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్(Medchal Collectorate)కు బాంబు బెదిరింపులు వచ్చాయి. కలెక్టరేట్‌లో బాంబు పెట్టినట్లు ఏవోకు ఈ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు అందినట్లు సమాచారం. అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసుల(Police)కు సమాచారం అందించారు. హుటాహుటిన కలక్టరేట్‌కు చేరుకున్న పోలీసులు అన్నిశాఖల అధికారులు, సిబ్బందిని బయటికి పంపి డాగ్ స్క్వాడ్(Dog Squad)తో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
అయితే, అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉండగా కరీంనగర్‌కు చెందిన మావోయిస్టు లక్ష్మణరావు(Maoist Lakshmana Rao) పేరిట మెయిల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఆఖరిగా ‘అల్లాహ్ అక్బర్’ అనే నినాదం ఉండటం గమనార్హం. కాగా ప్రస్తుతం కలక్టరేట్‌లో తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.