సీనియర్ నటుడు, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం(Brahmanandam) ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్(Hari Hara Veeramallu pre-release event)లో తనదైన శైలిలో నవ్వులు పూయించారు. యాంకర్ సుమ మైక్ అందించినప్పటి నుంచి తన ప్రసంగంతో సభికులను నవ్వించారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan)తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు. బ్రహ్మానందం ప్రసంగిస్తున్నంత సేపు పవన్ కల్యాణ్ సహా సభికులందరూ కడుపుబ్బ నవ్వారు. సుమ(Anchor Suma) రెండు నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చిందని, తాను ఐదు నిమిషాలు మాట్లాడతానని అంటున్నానని, ఇద్దరి మధ్య బేరం కుదరడం లేదని బ్రహ్మానందం చమత్కరించారు.

మీ ఒడిలో తలపెట్టుకుని వెక్కివెక్కి ఏడవాలని ఉంది..
పవన్ కల్యాణ్(Pawan Kalyan) గురించి రెండు నిమిషాలు మాట్లాడే బదులు చాలా థాంక్స్ అని చెప్పి వెళ్లిపోవచ్చని అన్నారు. “వాళ్లు అంతే అంటారు కానీ నేను 15 నిమిషాలు టైం తీసుకుంటా.. నా సంగతి నాకు తెలుసు” అంటూ నవ్వులు పంచుతూనే బ్రహ్మానందం ప్రసంగం కొనసాగించారు. పవన్ కల్యాణ్ గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన మానవత్వం పరిమళించిన మంచి మనిషి, గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన్ను తాను ఎన్నో ఏళ్లుగా చూస్తున్నానని, సమాజానికి ఉపయోగపడేలా ఏదో చేయాలని ఆయన నిరంతరం తపన పడుతూనే ఉంటారని పేర్కొన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఆయన ఎంచుకున్న మార్గంలోనే నడిచారే తప్ప, ఎవరి దారిలోనూ వెళ్లలేదని అన్నారు. సినిమాలో ఆయన డ్రెస్సింగ్ స్టైల్ గురించి ప్రస్తావిస్తూ, “మీ ఒడిలో తలపెట్టుకుని వెక్కివెక్కి ఏడవాలని ఉంది” అని బ్రహ్మానందం అనడంతో పవన్ కల్యాణ్ నవ్వాపుకోలేక పడిపడి నవ్వారు. మరి బ్రహ్మీ స్పీచ్ మీరూ చూసేయండి..






