Brahmanandam: విలన్ రోల్‌లో బ్రహ్మానందం.. థియేటర్స్ షేక్ అవాల్సిందే!

టాలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం(Brahmanandam) చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌ల త‌న కుమారుడు రాజా గౌతమ్(Raja Gautham) న‌టించిన‌ ‘బ్రహ్మా ఆనందం(Brahma Anandam)’ మూవీ యూనిట్ మీడియా స‌మావేశం నిర్వ‌హించింది. ఈ చిత్రంలో బ్ర‌హ్మీ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుద‌లైన‌ టీజర్, పాట‌ల‌(Songs)కు మంచి స్పంద‌న‌ వచ్చింది. అయితే ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమం(Promotion Event)లో బ్ర‌హ్మానందం ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇప్ప‌టివ‌ర‌కు కామెడీ(Comedy), సెంటిమెంట్ పాత్ర‌లతో అల‌రించిన తాను త్వ‌ర‌లోనే విలన్‌రోల్‌(Villain role)లోనూ క‌నిపిస్తాన‌ని చెప్పారు. ఆ విల‌నిజం థియేట‌ర్ అంతా షేక్ అయ్యేలా ఉంటుంద‌ని అన్నారు. హాస్య‌భ‌రిత పాత్ర‌ల‌తోనే అందరికీ చేరువైన ఆయ‌న కొత్త పాత్ర‌లో ఎలా స‌ర్‌ప్రైజ్ చేస్తారోన‌ని ఫ్యాన్స్(Fans) ఎదురుచూస్తున్నారు.

తాతా మనవడిగా తండ్రీకొడుకులు

కాగా ‘బ్రహ్మా ఆనందం’ సినిమా విష‌యానికి వ‌స్తే… ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు RVS నిఖిల్ తెరకెక్కించారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌(Swadharma Entertainment Banner)పై నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను నిర్మించారు. ప్రియా వడ్లమాని(Priya Vadlamani), ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నిజ జీవితంలో తండ్రీకొడుకులైన బ్ర‌హ్మానందం, గౌతమ్ ఈ మూవీలో తాతా మనవడిగా న‌టించారు.

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *