మేడ్చల్ జిల్లా కీసర మండంలోని నాగారం మున్సిపాలిటీలో ఉన్న శ్రీ వేంకట మరకత చంద్రమౌళీశ్వర హనుమాన్(Sri Venkata Marakata Chandramoulishwara Hanuman) దేవాలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavalu) ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు ఇవాళ వేంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకంతో ఉత్సవాలను ప్రారంభించినట్లు ఆలయ ఛైర్మన్ గూడూరు ఆంజనేయులు గౌడ్(Gudur Anjaneyulu Goud) ఆలయ తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మంగళ వాయిద్యాల నడుమ వేద స్వస్తి తులసిదళార్చన గణమతి హోమం(Ganapathi Homam), మూలామంత్ర హవనము హారతి అనంతరం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కాగా నిన్న ఆలయ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆలయ కమిటీ సమావేశం జరిగింది.
రేపు స్వామివారికి ప్రత్యేక రుద్రాభిషేకం
ఇక సోమవారం ఉదయం శ్రీ మరకత చంద్రమౌళీశ్వర స్వామి వారికి మహానాస్య పూర్వక రుద్రాభిషేకం(Rudrabhishekam), బిల్వార్చన హనుమాన్ అభిషేక, ధ్వజారోహణ కార్యక్రమాలు ఉంటాయని, అలాగే సాయంత్రం 6 గంటలకు కార్యసిద్ధి హనుమాన్(Lord Hanuman) స్వామి వారికి నాగవల్లిదళా పుష్పార్చన పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇక ఈనెల 15 మంగళవారం రోజు గోపూజ మంగళ వాయిద్యముల నడుమ వేద పారాయణ మూలమంత్ర హవనములు, ఆలయ దిగ్గలి మహా పూర్ణాహుతి కలశ ఉద్వాసన, ఆలయ సంప్రోక్షణ, చక్రస్నానములు, అవధూత స్నానము వేద ఆశీర్వచనతో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కళ్యాణం వంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
గ్రామోత్సవంతో ముగింపు
ఇక సాయంత్రం పండితులకు సన్మాన కార్యక్రమం, 6 గంటలకు గ్రామోత్సవం(Gramostavam) కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. ఆయా పూజా కార్యక్రమాలు బ్రహ్మ శ్రీ చిట్టిపెద్ది రామశర్మ, బ్రహ్మ శ్రీ శివ కార్తీక్ శాస్త్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. స్వామివార్ల ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు, కాలనీ ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆలయ ఛైర్మన్ ఆంజనేయులు గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ సెక్రటరీ కౌకుంట్ల అనంత రెడ్డి, ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.








