Mana Enadu : మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కన్నప్ప (Kannappa)’. భారీ తారాగణంతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రతిసోమవారం ఓ పాత్రకు సంబంధించిన లుక్ ను రివీల్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ సోమవారం మరో రెండు పాత్రలకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. వారే బ్రహ్మానందం (Bramhanandam), సప్తగిరి. కన్నప్ప సినిమాలో ఈ ఇద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్ తాజాగా చిత్రబృందం విడుదల చేసింది.
కన్నప్ప నుంచి పిలక, గిలక లుక్స్ ఔట్
కన్నప్ప సినిమాలో బ్రహ్మానందం ‘పిలక’ అనే పాత్రలో.. సప్తగిరి ‘గిలక’ అనే పాత్రలో నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘కన్నప్ప’ ప్రపంచంలోని అడవిలో జ్ఞానం, తెలివి, నైపుణ్యం నేర్పించే గురువుల పాత్రలో ఈ ఇద్దరూ కనిపించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న ప్రభాస్, అక్షయ్ కుమార్ (Akshay Kumar), మంచు విష్ణు, అవ్రామ్ లుక్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ప్రముఖ దర్శకుడు ముకేశ్ కుమార్ (Mukesh Kumar) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మంచు విష్ణుతోపాటు సీనియర్ నటులు మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ (Prabhas), నయనతార, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల (Madhu Bala), బ్రహ్మానందం, సప్తగిరి, మంచు విష్ణు తనయుడు అవ్రామ్ నటిస్తున్నారు. ఈ సినిమాను మంచు విష్ణు సొంత బ్యానర్ Ava ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ సినిమాకు స్టీఫెన్ డేవస్సీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Introducing the power-house of talent, the King of Comedy #Brahmanandam as #Pilaka & joining him is the talented @MeSapthagiri as #Gilaka; they portray the gurus of wisdom, wit & skills to teach the forests in the world of #Kannappa#HarHarMahadevॐ@themohanbabu… pic.twitter.com/hW6pqh0C6m
— Kannappa The Movie (@kannappamovie) September 30, 2024