గెలవాల్సిన మ్యాచులో ఓడితే ఆ బాధ జట్టు సభ్యులతోపాటు సగటు అభిమానికి కూడా అంతే ఉంటుంది. తాజాగా ఇంగ్లండ్(England)తో తొలి టెస్టులో టీమ్ఇండియా(Team India)కు ఇదే పరిస్థితి ఎదురైంది. జట్టులోని నలుగురు ప్లేయర్లు ఏకంగా ఐదు సెంచరీలు చేసినా భారత్ ఓడటం మింగుడుపడటం లేదు. లీడ్స్(Leads)లోని హెడింగ్లీ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఇండియాపై నెగ్గింది. భారత్ నిర్దేశించిన 371 పరుగుల టార్గెట్‌ను కేవలం 82 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. ఈ విక్టరీతో ఇంగ్లిష్ జట్టు ఐదు మ్యాచుల సిరీస్‌లో 1-0 లీడ్‌లోకి వెళ్లింది.

డకెట్.. కీలక ఇన్నింగ్స్
రెండో ఇన్నింగ్స్‌లో 371 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు ఆట ఆరంభించిన ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు జాక్ క్రాలీ (65), బెన్ డకెట్ 188 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం అందించారు. ముఖ్యంగా బెన్ డకెట్(Ben Duckett) వన్డే తరహాలో చెలరేగి ఆడాడు. కేవలం 170 బంతుల్లోనే 149 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. క్రాలీ అవుటైన తర్వాత వచ్చిన పోప్ (8) త్వరగానే వెనుదిరిగినప్పటికీ, డకెట్ తన జోరు కొనసాగించాడు. ఈ దశలో డకెట్, హ్యారీ బ్రూక్ (0) వెంటవెంటనే అవుటవ్వడం కాస్త ఆందోళన కలిగించింది. అయితే, కెప్టెన్ స్టోక్స్ (33)తో కలిసి రూట్(Root) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. స్టోక్స్(Stokes) అవుటైన తర్వాత, రూట్ (53*), వికెట్ కీపర్ స్మిత్ (44*) మరో వికెట్ పడకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.

లోయర్ ఆర్డర్, బౌలర్ల చెత్త ప్రదర్శనే కారణం
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 113 ఓవర్లలో 471 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 100.4 ఓవర్లలో 465 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 364 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా భారత్ ఓటమికి లోయర్ ఆర్డర్ బ్యాటర్ల విఫలం, సిరాజ్, జడేజా, శార్దూల్, ప్రసిద్ధ్ పేలవ బౌలింగ్ కారణమని విశ్లేషకులు అంటున్నారు. కాగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు(2nd Test) జులై 2 నుంచి జులై 6 వరకు ఎడ్జ్‌బాస్టన్(Edgbaston) వేదికగా జరగనుంది.
India becomes the first team in Test cricket history to lose a match after having 5 individual centuries.
🚨 FIRST TIME IN 148 YEARS 🚨#INDvsENG pic.twitter.com/4KORO0tPYl— Sanidhya Mishra (@Sanidhya2803) June 25, 2025






