భారత్, ఇంగ్లండ్(India vs England) మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్(Oval) మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 374 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఇంగ్లండ్ గెలవాలంటే 35 పరుగులు కావాల్సి ఉండగా… టీమిండియా(Team India) నెగ్గాలంటే 4 వికెట్లు అవసరం. ఒకవేళ వోక్స్(Woaks) బ్యాటింగ్‌కి రాకపోతే ఇంకో మూడు వికెట్లు తీయాల్సి ఉంటుంది.
రూట్ రికార్డు సెంచరీ
నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్లు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా క్రీజులో ఉన్న జో రూట్ (105) కెరీర్‌లో 39వ
సెంచరీ నమోదు చేశాడు. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలో అతడు టెస్టుల్లో కుమార సంగక్కర(38) సెంచరీల రికార్డును అధిగమించాడు. మరో ఎండ్‌లో హ్యారీ బ్రూక్ (111) సైతం సెంచరీతో చెలరేగాడు. వీరిద్దరూ క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా హ్యారీ బ్రూక్(Harry Brook) కేవలం 98 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సర్లతో దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈక్రమంలో రూట్(Root)ను ప్రసిద్ధ్, బ్రూక్‌ను ఆకాశ్ పెవిలియన్ పంపారు. ప్రస్తుతం క్రీజులో స్మిత్ (2*), ఓవర్టన్ (0*) ఉన్నారు. ఇక చివరి రోజు భారత బౌలర్లు ఏ మేరకు రాణిస్తారనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం
అంతకుముందు, లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం లభించినప్పటికీ, భారత బౌలర్లు కీలక వికెట్లు పడగొట్టారు. ఓపెనర్ బెన్ డకెట్ (54) హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే, జాక్ క్రాలీ (14), కెప్టెన్ ఓలీ పోప్ (27) వికెట్లను మహ్మద్ సిరాజ్ పడగొట్టగా, డకెట్‌ను ప్రసిద్ధ్ కృష్ణ ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 106 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కాగా భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగుల భారీ స్కోరు సాధించింది. యశస్వీ జైస్వాల్ (118) అద్భుత శతకంతో పాటు, ఆకాశ్ దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) కీలకమైన అర్ధ సెంచరీలతో జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లతో రాణించాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224 పరుగులకు, ఇంగ్లండ్ 247 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
When it matters the most Harry Brook & Joe Root stands tall 🫡
JOE ROOT scored 22 test centuries in last 5 years 🔥
Do we have players like him in our Indian cricket ? pic.twitter.com/bZRLZz1AI0
— Saachi (@anj_shas) August 3, 2025






