ManaEnadu: పెండింగ్ బిల్లులు(Pending Bills) చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని మాజీ సర్పంచులు(Former Sarpanches) ఆందోళనలకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy)ని కలిసి వినతి పత్రం ఇవ్వాలని అనుకున్న నేపథ్యంలో వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు(Arrest) చేస్తున్నారు. తాము అప్పులు తీసుకొచ్చి మరీ గ్రామాల అభివృద్ధికి కృషి చేశామని, వాటికి బిల్లులు అడిగితే అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నారని వారు మండిపడుతున్నారు. కాగా మాజీ సర్పంచులకు మద్దతుగా BRS నేతలు నిరసనలకు దిగారు. దీంతో హైదరాబాద్(HYD)లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు మాజీ సర్పంచులతోపాటు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు
మాజీ సర్పంచులకు మద్దతుగా BRS ఎమ్మెల్యేలు రోడ్డుపై ధర్నాకు దిగారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలనే డిమాండ్‌తో నిరసనలకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేసి PSలకు తరలిస్తుండగా BRS నేతలు అడ్డుకున్నారు. తిరుమలగిరి రోడ్డుపై ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, సంజయ్, కొత్త ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేపట్టారు.
ఇదేనా ప్రజాపాలన అంటే?: హరీశ్ రావు
బీఆర్ఎస్ సీనియర్ నేత (BRS Leader), మాజీ మంత్రి హరీష్‌రావు (Ex Minister Harish Rao), రేవంత్ రెడ్డి సర్కార్‌పై (Revanth Reddy Govt) తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మాజీ సర్పంచ్‌ల అరెస్టులను, అక్రమ నిర్బంధాలను తీవ్రంగా ఖండించారు. మాజీ సర్పంచ్‌లు అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద ఉన్న బంగారం కుదువ పెట్టి గ్రామ అభివృద్ధి కోసం చేసిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని హరీశ్ మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను అరెస్టులు చేయడమేనా.. అని ప్రశ్నించారు.
గ్రామానికి సేవ చేసిన పాపానికి సర్పంచ్ లు శిక్ష అనుభవించాలా?
సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ #harishrao #Sarpanches #Telangana pic.twitter.com/epXYshb2qH
— Pulse News (@PulseNewsTelugu) November 4, 2024