
తెలంగాణ(Telangana)లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల(BC Reservations) సాధన కోసం BRS ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్(Dharna Chowk)లో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష ఇవాళ్టి నుంచి ఆగస్టు 7 వరకు (72 గంటలు) కొనసాగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగ రంగాల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో బీసీ రిజర్వేషన్ బిల్లులు ఆమోదించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం(Central Govt) వాటిని ఆమోదించకపోవడంపై కవిత విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్, BJPల మధ్య రహస్య ఒప్పందం
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫులే ఫ్రంట్ (UPF) లాంటి సంస్థల పోరాటంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులను ప్రవేశపెట్టిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కేంద్రంపై ఒత్తిడి తేకుండా నాటకాలాడుతోందని ఆరోపించారు. తమిళనాడు(Tamilnadu) ఉదాహరణను ప్రస్తావిస్తూ, అక్కడి ప్రభుత్వం గవర్నర్‌తో జాప్యం జరిగినప్పుడు కోర్టును ఆశ్రయించి రిజర్వేషన్లు సాధించిందని, తెలంగాణ ప్రభుత్వం కూడా అదే బాటలో నడవాలని ఆమె సూచించారు. కాంగ్రెస్, BJPల మధ్య రహస్య ఒప్పందం కారణంగానే ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని కవిత ఆరోపించారు.
సాయంత్రం 5 గంటల వరకే అనుమతి
కాగా ఈ నిరాహార దీక్షలో 112 బీసీ కులాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని, తమ సమస్యలను వ్యక్తం చేస్తారని ఆమె తెలిపారు. ఈ దీక్ష గాంధీయ మార్గంలో శాంతియుతంగా జరుగుతుందని, ప్రభుత్వ అనుమతి లభించకపోయినా ఎక్కడైనా నిరసన కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు. కాగా కవిత దీక్షకు తొలుత అనుమతివ్వని పోలీసులు ఆ తర్వాత ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే అనుమతించారు.
#Hyderabad—-#Kavitha begins 72-hour #hungerstrike demanding 42% BC quota@BRSparty MLC @RaoKavitha on Monday launched a 72-hour hunger strike at #IndiraPark demanding 42% reservations for Backward Classes.
#BCReservations #KavithaProtest #SocialJustice #TelanganaPolitics pic.twitter.com/h7WO7WOgIw
— NewsMeter (@NewsMeter_In) August 4, 2025