బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela).. టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ అమ్మడి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా నటించిన “డాకు మహారాజ్(Daaku Mahaaraj)” సినిమాలో ఈ బ్యూటీ కీలక పాత్రలో నటించింది. ముఖ్యంగా ఈ మూవీలు ఊర్వశి చేసిన ‘దబిడి దిబిడి’ సాంగ్ కుర్రకారును తెగ ఆకట్టుకుంది. అంతకుముందు చిరంజీవి(Chiranjeevi) నటించిన “వాల్తేరు వీరయ్య(Valtheru Veeraya)”లోనూ ఓ ఐటెం సాంగ్‌లో సందడి చేసింది. ఇక తెలుగులో బ్లాక్ రోజ్ అనే సినిమాలో ఊర్వశీ నటించింది. తాజాగా ఈ అమ్మడికి సంబంధించి మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ సినిమాలో ఊర్వశీ రౌతేలాకి మంచి పాత్ర దక్కింది. ఆమె పాత్రలో గ్లామర్‌తో పాటు యాక్షన్ కూడా బాగానే హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో ఆమెకు మరో బంపర్ ఆఫర్(Bumper Offer) తగిలినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబో(Prashanth Neel, NTR Combo)లో రాబోతున్న సినిమాలో ఊర్వశికి ఛాన్స్ దొరికిందట. ఇప్పటికే, ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మొదలైంది. వచ్చే షెడ్యూల్‌లో ఈ బ్యూటీ కూడా షూట్‌లో జాయిన్ కానుంది.
పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాలో..
కాగా ప్రస్తుతం జరుగుతున్న తొలి షెడ్యూల్‌లో తారక్(NTR) లేని సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. మార్చి నుంచి ఎన్టీఆర్ ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగు పెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ(RFC)లో ఓల్డ్ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను రెడీ చేస్తున్నారు. ఈ సెట్‌లోనే ఈ సినిమా రెండో షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది. ఈ పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాలో NTRకు జోడీగా రుక్మిణీ వసంత్(Rukmini Vasant) నటిస్తుండగా.. మలయాళ యువ హీరో టొవినో థామస్(Tovino Thomas) కీలక పాత్రలో నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, NTR Arts సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.






