
అగ్రరాజ్యం అమెరికా(America)ను అగ్ని(Wild Fire) దహించివేస్తోంది. పేరుకు పెద్దన్నగా చెప్పుకునే ఆ దేశాధినేతలు సైతం కార్చిచ్చును కంట్రోల్ చేయలేకపోతున్నారు. 8 రోజుల క్రితం లాస్ ఏంజెలిస్(Los Angeles)లో మొదలైన ఈ కార్చిచ్చు ఇప్పుడు కాలిఫోర్నియా(California)కు ఎగబాకింది. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అటు అమెరికాలోని లాస్ ఏంజెలిస్ మహానగరం ఇప్పుడు మరుభూమిగా మార్చింది. వేలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ.15 లక్షల కోట్ల మేర ఆస్తినష్టం(Property damage) జరిగి ఉండొచ్చని అక్కడి మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే వాస్తవంలో మాత్రం అంతకుమించే ఉంటుందని స్థానిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారీగా ఎగిసిపడుతున్న మంటలు
ఇప్పటివరకు కార్చిచ్చు కారణంగా జరిగిన నష్టాన్ని బైడెన్ ప్రభుత్వం(Biden Govt) అధికారికంగా వెల్లడించలేదు. ఆస్తినష్టానికి మించిన పర్యావరణ నష్టాన్ని(Environmental damage) చాలామంది లెక్క వేయట్లేదు. ఈ కార్చిచ్చు కారణంగా.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. పొగను అంతరిక్షంలోని ఉపగ్రహాల నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయంటే.. తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 25 మంది మరణించగా 88,000 మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. కార్చిచ్చుతో లాస్ ఏంజెలిస్ సంపద ఆవిరైపోయింది. ఎటు చూసినా.. పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిన ఇళ్లు దర్శనమిస్తున్నాయి. ధనవంతులు, సెలబ్రిటీలు, హాలీవుడ్ తారలు మంటల ధాటికి ఇళ్లను వదిలేసి వెళ్లిపోయారు.
గంటల్లోనే వేల ఎకరాలకు వ్యాపించాయి
కాగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెలిస్, గ్రేటర్ లాస్ ఏంజెలిస్ అటవీ ప్రాంతంలో జనవరి 7న కార్చిచ్చు అంటుకుంది. మొదట 10 ఎకరాల్లో చెలరేగిన కార్చిచ్చు కొన్ని గంటల్లోనే 3 వేల ఎకరాలకు పైగా వ్యాపించింది. కార్చిచ్చులు, సహజ వాతావరణ మార్పులతో పాటు, మానవ తప్పిదాల వల్ల కూడా ఏర్పడిన విలయంగా వాతావరణ నిపుణులు అంటున్నారు. ఇక, తాజా పరిస్థితులపై అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(New President Donald Trump), టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్(Tesla CEO Elon Musk)లు సీరియస్ అయ్యారు. కాలిఫోర్నియా గవర్నర్ కారణంగానే ఈ స్థాయి నష్టం వాటిల్లిందంటూ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు.
#FPLive: As California wildfires continue to rage, the death toll has surged to 25. Around 88,000 people in Los Angeles County were under evacuation orders on January 14. https://t.co/AXhnwJXM4p
— Firstpost (@firstpost) January 15, 2025