క్లబ్ ఓనర్‌తో గొడవపడ్డ నటి కల్పిక గణేశ్‌పై (Kalpika Ganesh) కేసు నమోదైంది. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు కేసు బుక్ చేశారు. ప్రిజం క్లబ్ యజమాని దీపక్ బజాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మే 29న క్లబ్‌కు వెళ్లిన కల్పిక రూ.2,200 బిల్ చేసి కాంప్లిమెంటరీగా కేక్ ఇవ్వమని కోరింది. కుదరదని మేనేజర్ చెప్పడంతో ఆయనతో గొడవకు దిగారని క్లబ్ యజమాని ఫిర్యాదులో పేర్కొన్నారు. మేనేజర్ ఇతర సిబ్బంది తనపై అత్యాచారం, అసభ్యంగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో నటి తప్పుడు ప్రచారం చేశారని కూడా ఆయన తెలిపారు. క్లబ్‌లోని సామగ్రిని ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కల్పికపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
🚨 Kalpika Ganesh Slams Odeum by Prism for Poor Management.
Actress Kalpika Ganesh shared a video calling Odeum by Prism one of the worst-managed places. She spoke about inhumane treatment by staff and many negative reviews online. The post is viral.#KalpikaGanesh… pic.twitter.com/qncVAwKFQC
— Whynot Cinemas (@whynotcinemass_) May 31, 2025






