Formula E Car Race: కేటీఆర్‌పై మరో కేసు.. ఎందుకంటే?

బంజారాహిల్స్ PSలో మాజీ మంత్రి KTR పై కేసు నమోదైంది. గురువారం విచారణ తరువాత ACB ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులపై దుర్భాషలాడి, న్యూసెన్స్, ట్రాఫిక్ సమస్యకు కారణయ్యారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు. ACB ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్(Telangana Bhavan) వరకు అనుమతి లేకుండా ర్యాలీ(Rally) తీయడంపై సైతం KTRపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఆయనతో పాటు మరోఆరుగురిపై కేసు నమోదు చేశారు. కేటీఆర్‌తో పాటు బాల్క సుమన్, మన్నె గోవర్ధన్, జయసింహ, క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్‌పై కూడా కేసులు నమోదయ్యాయి.

నిధుల దారిమళ్లింపుపై అభియోగాలు

అయితే పోలీసుల తీరును కేటీఆర్ తప్పుబట్టారు. మీడియాతో మాట్లాడితే ఇబ్బంది ఏంటని పోలీసులను ప్రశ్నించారు. అర్ధాంతరంగా మీడియా సమావేశం ముగించిన ఆయన BRS కార్యాలయానికి వెళ్లిపోయారు. ఫార్మూలా ఈ కారు రేసు(Formula E Car Race)లో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయనేది ప్రభుత్వ వాదన. అనుమతి లేకుండానే విదేశీ కరెన్సీ రూపంలో FEOకు నిధులు చెల్లించారని దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఫిర్యాదు మేరకు 2024 డిసెంబర్ 19న KTRపై ఏసీబీ కేసు నమోదు చేసింది. డిసెంబర్ 20న ఏసీబీ FIR ఆధారంగా ED ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ నెల 16న ఈడీ విచారణకు KTR హాజరు కావాల్సి ఉంది.ఫార్మూలా ఈ కారు రేసు కేసులో IAS అధికారి అరవింద్ కుమార్ , HMDA రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిల పేర్లను కూడా దర్యాప్తు సంస్థలు చేర్చాయి. వీరిద్దరిని దర్యాప్తు సంస్థలు విచారించాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *