
కాంగ్రెస్ MLA తీన్మార్ మల్లన్న(Chintapandu Naveen)పై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ(Congress Disciplinary Committee) సీరియస్ అయింది. కులగణన సర్వే(Census Survey)లో BC జనాభా లెక్కల విషయంలోను, వివిధ వేదికలపై నుంచి పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనకు షోకాజ్ నోటీసులు(Show Cause Notices) ఇచ్చింది. కులగణన ఫామ్‌కు నిప్పుపెట్టడం, ఓ అగ్ర కులంపై తీవ్ర వ్యాఖ్యలు చేయండంతో అధిష్ఠానం MLC నవీన్‌పై చర్యలు చేపట్టింది. వాస్తవానికి గత కొంతకాలంగా ఆయన పార్టీతో అంటీముట్టనట్లే వ్యవహరిస్తున్నారు.
పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న తీరు?
కాంగ్రెస్(Congress) టికెట్‌పై MLC అయిన మల్లన్న కొద్దినెలలుగా వివిధ అంశాలపైన పార్టీ విధానాలకు విరుద్ధంగా స్పందిస్తూ వస్తున్నారు. అయినా ఆయన విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్న TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తాజాగా ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేకు వ్యతిరేకంగానూ తీన్మార్ మల్లన్న(Tinmar Mallanna) మాట్లాడటం పట్ల సీరియస్ అయ్యారు. మరోవైపు మంత్రి సీతక్క(Minister Seethakka) సైతం ఆయన తీరును తప్పుబట్టారు. మల్లన్న కాంగ్రెస్‌లో ఉన్నారో లేదో తేల్చుకోవాలని హితవు పలికారు. తీన్మార్ మల్లన్న తనను తిడితే స్వాగతిస్తానని, కానీ.. ఓ కులాన్ని తిట్టడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. వీరితోపాటు చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆయన తీరుపై మండిపడుతున్నారు. ఈనేపథ్యంలోనే ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.