Ceasefire: భారత్, పాకిస్థాన్ మధ్య సీజ్‌ఫైర్ కొనసాగింపు

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు(India, Pakistan War Crisis) నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు ఆయుధాలకు పనిచెప్పాయి. దీంతో ఇండియా-పాకిస్థాన్ మధ్య మరో వార్(War) తప్పదని అంతా భావించగా.. అనూహ్యంగా రెండు దేశాల మధ్య శాంతిచర్చలు(Peace talks) ప్రారంభమయ్యాయి. ఇరు దేశాలు సీజ్ ఫైర్‌(Ceasefire)కి అంగీకరించాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సరిహద్దుల వెంబడి పరస్పర సైనిక చర్యల(military actions)ను నిలిపివేస్తూ ఇటీవల కుదిరిన ఒప్పందాన్ని పొడిగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

India-Pakistan Ceasefire: DGMOs No Firing Across LoC

ఇరు దేశాల DGMOల మధ్య కుదిరిన ఒప్పందం

ఈ మేరకు రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయి అధికారుల మధ్య అవగాహన కుదిరింది.
మే 10వ తేదీన ఇరు దేశాల DGMOల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సరిహద్దుల్లో కాల్పుల విరమణ(Ceasefire) అమలవుతోంది. తాజాగా, ఈ ఒప్పందాన్ని మరింత కాలం కొనసాగించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య విశ్వాసం పెంపొందించే చర్యలను (Confidence-Building Measures – CBMs) కొనసాగించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్య ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని ఇరుదేశాల అధికారులు భావిస్తున్నారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *