Roof Collapsed: నైట్‌క్లబ్‌లో కూలిన పైకప్పు.. 184 మంది మృతి

డొమినికన్ రిపబ్లిక్‌(Dominican Republic) రాజధాని శాంటో డొమింగో(Santo Domingo)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడి ఓ నైట్‌క్లబ్‌లో అర్ధరాత్రి కన్సర్ట్ జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. దీంతో వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వందమందికి ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. తాజాగా మృతుల సంఖ్యను అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ 184 మంది మృతి చెందారని, మరో 145 మందికి పైగా గాయాలైనట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే మరణించిన వారిని గుర్తించడంలో అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శిథిలాల కింద పడటంతో శరీరాలు ఛిద్రమయైపోయి గుర్తుపట్టలేనంతగా ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది.

పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుండగా..

కాగా శాంటో డొమింగోలోని వన్ స్టోర్ జెట్ సెట్(One Store Jet Set) నైట్‌క్లబ్‌లో మంగళవారం (ఏప్రిల్ 8) రాత్రి ఓ కన్సర్ట్ నిర్వహించారు. ఈక్రమంలోనే వందలాది మంది అక్కడకు వచ్చారు. అంతా కలిసి పాటలు వింటూ హాయిగా ఎంజాయ్ చేస్తుండగా.. ఒక్కసారిగా పైకప్పు కూలి పడింది. దీంతో అక్కడున్న అనేక మంది శిథాలల కింద చిక్కుకుపోయారు. మరికొంత మంది ప్రాణాలు దక్కించుకునేందుకు బయటకు పరగులు పెట్టారు. విషయం గుర్తించిన పోలీసులు(Police), రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *