Champions Trophy: హైబ్రిడ్ మోడల్‌కు పాక్ నో.. సౌతాఫ్రికాలో ఛాంపియన్స్ ట్రోఫీ?

Mana Enadu: మినీ ప్రపంచకప్‌గా పేరొందిన ఛాంపియన్స్‌ ట్రోఫీ(Champions Trophy) నిర్వహణ వేదికపై సందిగ్ధం వీడటం లేదు. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ వచ్చే ఫిబ్రవరిలో పాకిస్థాన్‌(Pakistan)లో జరగాల్సి ఉంది. అయితే భారత్-పాక్ దేశాల మధ్య రాజకీయ పరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో టీమ్ఇండియా(Team India) ఆ దేశంలో పర్యటించదని బీసీసీఐ(Board of Control for Cricket in India) తేల్చి చెప్పింది.

ఇదే విషయాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి కూడా చెప్పింది దీంతో ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డుకు సమాచారమిచ్చింది. మరోవైపు ఇప్పటికే పాక్‌లో ఈ టోర్నీకోసం మూడు స్టేడియాలను ముస్తాబు చేస్తున్నారు. అయితే తాజా నిర్ణయంతో పాకిస్థాన్ పరిస్థితి కుడితిలోపడ్డ ఎలుకలాగ తయారైంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది.

భారత్‌‌లో జరిగే ఏ ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనం: పాక్

ఇదిలా ఉంటే ఆతిథ్య దేశం నుంచి అనూహ్యంగా టోర్నీకే దూరమయ్యే పరిస్థితి నెలకొంది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌లో భారత జట్టు పర్యటించదని బీసీసీఐ పేర్కొంది. అయితే భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లను వేరే దేశంలో నిర్వహిస్తే (Hybrid model) మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటామని చెబుతోంది భారత్.

దీంతో టీమ్ఇండియా మ్యాచ్‌‌లను UAEలో నిర్వహించాలని పాక్ క్రికెట్‌ బోర్డును ICC కోరింది. దీనికి పాక్ బోర్డు ఒప్పుకోలేదని సమాచారం. తమ ఆతిథ్య హక్కులను తగ్గిస్తే టోర్నీనే వీడాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు భారత్‌‌లో జరిగే మరే ఇతర ఐసీసీ ఈవెంట్ల(ICC events)లోనూ పాల్గొనకూడదని నిర్ణయించిందట.

అధికారిక నిర్ణయం తర్వాతే ఏదైనా

మరోవైపు పాకిస్థాన్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ దక్షిణాఫ్రికా(South Africa)కు తరలివెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాక్‌కు వెళ్లేందుకు భారత్ సుముఖంగా లేకపోవడం, హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించేందుకు PCB ఒప్పుకోకపోవడంతో SAలో ఈ టోర్నీని నిర్వహించాలని ICC భావిస్తున్నట్లు సమాచారం.

పాక్ క్రికెట్ బోర్డు అధికారికంగా తమ తుది నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటి వరకు హైబ్రిడ్ మోడల్‌పై చర్చలు జరగలేదని PCB చెబుతోంది. దీంతో ఈ మినీ వరల్డ్ కప్ నిర్వహణ వేదికపై సందిగ్ధం నెలకొంది. కాగా భారత్, పాక్ జట్ల మధ్య చివరిసారి 2012లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. పాక్ జట్టు 2016లో T20 ప్రపంచకప్ కోసం, గతేడాది వన్డే వరల్డ్ కప్ కోసం భారత్‌లో పర్యటించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *