
కోడి పందేలు.. బసవన్నల నృత్యాలు.. హరిదాసుల సంకీర్తనలు.. ఆడపడుచుల రంగవల్లులు, పిండివంటలతో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు(Sankranti Celebrations) అంబరాన్నంటాయి. మరోవైపు తమ అభిమాన హీరోల సినిమాలు విడుదలవడంతో ఈసారి పొంగల్‌కు తెలుగు ప్రజలకు డబుల్ ఎంజాయ్‌మెంట్ దక్కినట్లైంది. ఇప్పటికే రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ మూవీలు థియేటర్లలో సందడి చేస్తుండగా.. ఇవాళ ‘సంక్రాంతికి వస్తున్నాం’తో తెలుగు ప్రజలను విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh) పలకరించారు. దీంతో ఈ సంక్రాంతికి సందడి తగ్గేదేలేదు అన్నట్లుగా ప్రజలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
మంత్రుల సొంత ఇలాకాలోనే
ఇదిలా ఉండగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఆసక్తికర పోస్టర్(Poster) వెలసింది. అందులో ‘‘ ఓ వైపు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చంద్రబాబు ఫొటో ఉంటే.. మరోవైపు బాస్ ఈజ్ కమింగ్ సూన్ అంటూ KCR ఫొటో పెట్టారు. మధ్యలో డాకు మహారాజ్ టైటిల్‌తో బాలయ్య పిక్ సెట్ చేశారు. వీరితోపాటు మాజీ MP నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి మాజీ MLA సండ్ర వెంకట వీరయ్య ఫొటోలనూ పెట్టారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ పోస్టర్ దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ ఖమ్మం జిల్లా సోషల్ మీడియా(Social Media) అకౌంట్లలో తెగ ట్రెండ్(Trending) అవుతోంది. ఇదిలా ఉండగా తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత ఇలాకా కావడంతో పండుగ వేళ ఈ పోస్టర్ హాట్‌టాపిక్‌గా మారింది.
Posani Krishna Murali: రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై 15కి పైగా కేసులు!
సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)పై AP పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా నరసరావుపేట పోలీస్‌స్టేషన్(Narasa Raopet Police Station)లో ఆయనపై కేసు నమోదైంది. BNS 153A 67 ఇట్ యాక్ట్ 504 సెక్షన్‌ల కింద…