Mana Enadu : తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. వారానికి నాలుగు సిఫార్సు లేఖలు అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అనుమతించారని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
వారానికి 4 సిఫార్సు లేఖలు
సోమవారం రోజున సీఎంతో బీఆర్ నాయుడు (BR Naidu) సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చంద్రబాబుతో చర్చించినట్లు ఆయన తెలిపారు. వారానికి నాలుగు సిఫార్సు లేఖలు అనుమతించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు వెల్లడించారు. వారానికి రెండు బ్రేక్ దర్శనాలు, రెండు రూ.300 దర్శనానికి సంబంధించిన లేఖలు అనుమతించేందుకు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు.








