
తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు(Chandrababu) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు(Mahanadu) రెండో రోజు సమావేశాల్లో ఆయనను పార్టీ జాతీయ అధ్యక్షుడి(National President of TDP)గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు ఒక్కరే నామినేషన్(Nomination) వేశారు. దీంతో ఆయనను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు.
1995లో తొలిసారి..
కాగా, చంద్రబాబు 1995లో తొలిసారి TDP జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి గడిచిన మూడు దశాబ్దాలుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. 2014 రాష్ట్ర విభజన వరకు పార్టీ అధ్యక్షుని(Party President)గా ఉన్న ఆయన.. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. చంద్రబాబుకు పార్టీపై ఉన్న పట్టుదల, ప్రజల సమస్యలపై ఆయన చేస్తున్న కృషి, నాయకత్వ నైపుణ్యం ఇలా పలు అంశాలు ఆయనను మరోసారి అగ్రస్థానానికి చేర్చాయి. ఈ ఎన్నిక ద్వారా ఆయన నాయకత్వానికి పార్టీలో మద్దతు మరోసారి స్పష్టమైంది.
Chandrababu Naidu re-elected as TDP National President. He has once again been unanimously elected as the TDP National President.
Naidu has been serving as the TDP President for the past 30 years, since 1995. pic.twitter.com/mutFzc9gQp
— NewsMeter (@NewsMeter_In) May 28, 2025