బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony). భిన్నమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన కొత్త మూవీ ‘మార్గన్’ (Maargan). లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో సముద్రఖని, దీర్షిక, బ్రిగిడా సాగ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ ప్రతినాయకుడిగా పరిచయమవుతుండడంతో విశేషం. సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచారంలో భాగంగా తెలుగు ట్రైలర్ను (Maargan Telugu Trailer) చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. పలు సంభాషణలు, టేకింగ్ ఆకట్టుకుంటోంది.






