గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న తాజా చిత్రం పెద్ది (Peddi) పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా(Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. రామ్ చరణ్ ఈ చిత్రంలో మాస్ అవతారంలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ ఆయన చెర్రీ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన పెద్ది ఫస్ట్ షాట్ గ్లిమ్స్(Glimpse) సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఈ గ్లిమ్స్‌లో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ మైండ్ బ్లోయింగ్‌గా ఉందని, ఆయన ఊరమాస్ ఎనర్జీతో బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
చెర్రీ కెరీర్‌లోనే ఒక ఐకానిక్ రోల్
తాజాగా రామ్ చరణ్‌కు సంబంధించి మరో మాస్ లుక్(Mass Look) బయటికొచ్చింది. ఆయన జిమ్‌లో వర్కవుట్ చేస్తూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫిక్‌లో చెర్రి హెయిర్ కట్, గడ్డంతోపాటు భారీ కండలతో కట్ బనియన్‌లో కనిపించాడు. ఈ ఫొటో చూసిన మెగా అభిమానులు పెద్ది సినిమా కోసం ఫుల్ ఎగ్జైట్మెంట్‌లో ఉన్నామంటూ సోషల్ మీడియా(SM)లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర పేరు కూడా ‘పెద్ది’గానే ఉంటుందని, ఇది ఆయన కెరీర్‌లోనే ఒక ఐకానిక్ రోల్ అవుతుందని టాక్.
Changeover for @PeddiMovieOffl begin!!
Pure grit. True Joy. 💪🏻 pic.twitter.com/trhvrG7wyA
— Ram Charan (@AlwaysRamCharan) July 21, 2025
రూ.230-250 కోట్ల బడ్జెట్‌తో పాన్-ఇండియా రేంజ్‌లో
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. క్లైమాక్స్ స్పోర్ట్స్ మ్యాచ్ కోసం ఢిల్లీ స్టేడియం ఎంపికైనట్లు సమాచారం. జాన్వీ కపూర్(Janvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు(Jagapathi babu) వంటి స్టార్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రూ.230-250 కోట్ల బడ్జెట్‌తో పాన్-ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. 2026 మార్చి 26న విడుదల కానున్న పెద్ది రామ్ చరణ్ మాస్ ఇమేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.






