పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్(The Raja Saab)’. ఈ మూవీ ఓటీటీ రైట్స్(OTT Rights)కు సంబంధించి సంచలన ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా హిందీ ఓటీటీ హక్కుల(Hindi OTT Rights)ను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) రూ.100 కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు తాజా బజ్ వెల్లడిస్తోంది. ఒకే భాష హక్కులకు ఇంత భారీ మొత్తం ఆఫర్ రావడంతో ప్రభాస్ క్రేజ్ మరోసారి సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ మారుతీ(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రొమాంటిక్ హారర్ కామెడీ జానర్‌లో రూపొందుతోంది.
రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(Sanjay Datt), మాళవికా మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Nidhi Agharwal), రిద్ధి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం, కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌తో ఈ చిత్రం సాంకేతికంగా కూడా ఉన్నతంగా ఉంటుందని అంచనా.

నాన్-థియేట్రికల్ రైట్స్ ఎంతంటే?
ఇదిలా ఉండగా ‘ది రాజాసాబ్’ నాన్-థియేట్రికల్ రైట్స్(Non-theatrical rights) రూ.180 కోట్ల నుంచి రూ.210 కోట్ల వరకు పలుకుతున్నట్లు సమాచారం. హిందీ ఓటీటీ హక్కులు మాత్రమే రూ.100 కోట్లకు పైగా ఉండటం విశేషం. ఆడియో రైట్స్‌ను టీ-సిరీస్ ఇప్పటికే సొంతం చేసుకుంది. ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ప్రభాస్ గత చిత్రం ‘సలార్(Salar)’ ఓటీటీలో సంచలన రికార్డులు సృష్టించిన నేపథ్యంలో, ‘ది రాజాసాబ్’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్స్(First look Posters), గ్లింప్స్(Glimpse)లకు వచ్చిన సూపర్ రెస్పాన్స్ ఈ సినిమా హైప్‌ను మరింత పెంచింది.
#TheRajaSaab Still A Song & Patch Works were Pending ✅⭐
Budgeted 450CRS 👀
Biggest HORROR Comedy Movie LOADING🥁💥
Streaming Rights TALKS with NETFLIX & Prime Video in Range Of 180-200CRS Deal🤝#TheRajaSaabOnDEC5th#Prabhas | #MalavikaMohanan | #RiddhiKumar | #ThamanS pic.twitter.com/aL4gme2Mb8
— OTT STREAM UPDATES (@newottupdates) July 19, 2025






