రైల్వే టర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈ రైల్వే టర్మినల్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తోపాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
హైదరాబాద్ మహ నగరంలోని జీవించేందుకు తరలి వస్తున్నారు. అలాంటి వేళ సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఆయా రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు రైల్వే శాఖ నడం బిగించింది.
నగర శివారులోని చర్లపల్లిలో రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి పరచాలని నిర్ణయించింది. అందులోభాగంగా చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి పరిచింది. ఈ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి పరచడం ద్వారా నగరంలోని ఇతర రైల్వే స్టేషన్ల పై ఒత్తిడి తగ్గుతోందని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం వందలాది కోట్లతో ఈ రైల్వే టర్మినల్‌ను రైల్వే శాఖ అభివృద్ధి పరిచింది.
అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను అభివృద్ధి చేశారు. ఈ స్టేషన్ నుంచి 24 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇక ఈ టెర్మినల్ గూడ్స్ రైళ్లకు సైతం మరో రకంగా ఉపయోగపడనుంది. అంటే.. హైదరాబాద్ పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా గూడ్స్ రైళ్లు ఇక్కడి నుంచి నడవనున్నాయి. రూ. 428 కోట్లతో చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి పరిచారు.
పార్సిల్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించడంతోపాటు 25 జతల రైళ్లను హ్యాండిల్ చేసేలా ఈ స్టేషన్‌లో ట్రాకులు ఏర్పాటు చేశారు. అందుకోసం 10 కొత్త ట్రాకులను నిర్మించారు.
ఈ స్టేషన్‌లో మొత్తం 19 ట్రాక్స్ ఉన్నాయి. దీంతో ఈ టెర్మినల్ చాలా పెద్దగా ఉంటుంది. మరోవైపు ఈ స్టేషన్‌లో మొత్తం మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు ఉన్నాయి. గతంలో ఒకటి ఉండగా.. నూతనంగా రెండు టర్మినల్స్‌ను నిర్మించారు.






